Harish Rao: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణ ఎన్నికల పోటీ నుంచి టీడీపీ, వైఎస్సార్‌టీపీ తప్పుకున్నాయి. చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో పోటీ వద్దని చెప్పడంతో కాసాని జ్ఞానేశ్వర్ తీవ్ర అసంతృప్తికి లోనై ఆ తర్వాత బీఆర్ఎస్‌లోకి అనుచరులతో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు వైఎస్సార్టీపీ వంతు అనిపిస్తోంది. వైఎస్సార్టీపీ నుంచి పలు నేతలు, అన్ని జిల్లాల కోఆర్డినేటర్లు, కార్యకర్తలు, గట్టు రాంచదర్ రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి గులాబీ కండువాలు కప్పి రాష్ట్రమంత్రి హరీశ్ రావు స్వాగతం పలికారు. వైఎస్సార్‌టీపీ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్వాగతం తెలిపారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో బీఆర్‌ఎస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం అయినట్టుగానే కథనాలు వస్తుండడం గమనార్హం.
Also Read: MLA Laxmareddy: జోరుగా కొనసాగుతున్న జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం
తెలంగాణలో పోటీ చేద్దామని ప్రతిపాదించి కాంగ్రెస్ కోసం వెనక్కి తగ్గటంపైన షర్మిల నిర్ణయంతో పార్టీ నేతలు విభేదించారు. ఈ నేపథ్యంలో చాలా మంది వైఎస్సార్‌టీపీ నేతలు పార్టీని వీడారు. ఆ పార్టీ నుంచి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీష్‌రావు సమక్షంలో గట్టు రాంచందర్ రావు ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, అన్ని జిల్లా కోఆర్డినేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబా పార్టీ కండువా కప్పుకున్నారు. వీరి చేరిక సమయంలో మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. వైఎస్సార్టీపీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు స్వాగతం అంటూ ఆహ్వానించారు. తండ్రి సమానులైన కేసీఆర్‌ను రాజకీయం కోసం నానా మాటలు తిట్టి ఈరోజు రాజకీయాల కోసం పార్టీని గాలికి వదిలేసిన నాయకురాలు షర్మిల అంటూ విరుచుకుపడ్డారు.
Also Read: AP CM YS Jagan: ట్రెండింగ్‌లో సీఎం జగన్ ఫొటో.. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమానికి భారీ మద్దతు
మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ వాళ్లు పార్టీ పెట్టగలుగుతారా, పార్టీ నడపగలుగుతారా అని అవహేళన చేశారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని 14 సంవత్సరాలు పార్టీని నిలబెట్టి, రాష్ట్ర సాధన కోసం చావు అంచుల వరకు వెళ్లి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్. సమైక్య నాయకులు పార్టీ పెట్టడమంటే పాన్ డబ్బా పెట్టడం కాదు అని అవహేళన చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే చీకటిమయం అవుతుందని అన్నారు. తెలంగాణ పథకాలను దేశమే ఆదర్శంగా తీసుకుని అమలు చేసేలా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ . తండ్రి సమానులైన కేసీఆర్‌ను రాజకీయం కోసం నానా మాటలు తిట్టి ఈరోజు రాజకీయాల కోసం పార్టీని గాలికి వదిలేసిన నాయకురాలు షర్మిల.” అంటూ మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు.
పెద్ద మొత్తంలో క్యాడర్ బీఆర్ఎస్‌లో చేరడంతో వైఎస్సార్టీపీ గులాబీ పార్టీలో విలీనం అయిందని వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎష్ షర్మిల స్పందించాల్సి ఉన్నది. నిజానికి ఎన్నికలకు ముందు వరకు వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ప్రయత్నాలు జరిగాయి.