మెదక్ జిల్లా ఇందిరాగాంధీ ఖిల్లా అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు వెలగబెట్టింది ఏమీ లేదన్నారు. మెదక్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఉద్యమ నాయకుడని కేసీఆర్ ని గెలిపిస్తే అప్పుల కుప్ప చేసి తెలంగాణని దోచుకున్నారని విమర్శించారు. ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కేసీఆర్ ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నారని ఆరోపించారు.
బీజేపీ అధికారంలోకి వస్తే మేడిగడ్డపై సీబీఐ విచారణ చేయిస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీటలు వారుతున్న పరిస్థితిలో కాంగ్రెస్ కు తెలివి వచ్చిందని.. సీబీఐ విచారణకు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడుగా తాను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ మునిగి పోతున్న నావ అని ఎద్దేవా చేశారు. డాటార్ డాడీల మధ్య ఉత్తరాలు ఇంకా జరుగుతాయని విమర్శించారు.. కుటుంబ పార్టీలు ప్రజల కొంపలు ముంచుతాయన్నారు.…
Kishan Reddy : తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు చేరారు. ఆదివారం మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర కార్యాలయం(State office)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముందు.. కాషాయ పార్టీలో చేరిన ఖైరతాబాద్‌కు చెందిన పలువురికి పార్టీ కండువా కప్పి.. ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ఆత్మ ఘోషిస్తుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో పనులు…
Election Results 2023: తెలంగాణలో కాంగ్రెస్ ధాటికి పోటీ చేసిన మంత్రులు చాలా మంది ఓటిమి బాటపట్టారు. జనాల్లో ఉంటూ భారీగా ఖర్చు పెట్టిన వాళ్లు విజయం సాధించారు.
తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును అభినందిస్తున్నానని సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. గత పది సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టాల్సి ఉండేదన్నారు. ఆలస్యంగా నైనా ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పజెప్పారన్నారు.
మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన ఘనవిజయంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు వ్యాఖ్యానించారు. 2024లో 350 సీట్లకు పైగా గెలిచి మరలా మరోసారి ప్రధాని మోడీ అని మరోసారి రుజువు చేసిన ప్రజా తీర్పు అని ఎంపీ జీవీఎల్ అన్నారు. మోడీ ప్రభుత్వం విశ్వసనీయత, అవినీతి రహిత పాలన ఈ మూడు రాష్ట్రాల్లో ఘన విజయానికి కారణమన్నారు.
కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడి బీజేపీ పోరాడితే చివరకు కాంగ్రెస్ లాభపడిందన్నారు. ఈ సందర్భంతా బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. కరీంనగర్ విషయానికొస్తే ప్రతిసారి తన ఓట్ల శాతం పెరుగుతోందన్నారు.
సంగారెడ్డిలో ఓటమిపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. సంగారెడ్డి ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డి ప్రజలు తనకు 5 ఏళ్లు విశ్రాంతి ఇచ్చారని.. తనకు ఓట్లు వేసిన 65 వేల మందికి.. అలాగే తనకు ఓట్లు వేయని 71వేల మందికి జగ్గారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డి ప్రజలు తనకు కౌన్సిలర్‌గా, మున్సిపల్ ఛైర్మన్‌గా అవకాశం ఇచ్చారన్నారు.