PM Modi: మాదిగల విశ్వరూప మహా సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ వేస్తామని ప్రకటించారు. దీనిపై న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉందన్నారు. మాదిగల ఉద్యమాన్ని తాము గుర్తించామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అంబేడ్కర్ స్వప్నాన్ని తాము నెరవేరుస్తామన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మాదిగ ఉపకులాలు బహిరంగ సభ నిర్వహించాయి. ఈ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ… బీఆర్ఎస్, కాంగ్రెస్ మాదిగలను విరోధులుగా చూస్తు్న్నాయన్నారు. ఎంతో ప్రేమతో మందకృష్ణ తమ్ముడు ఈ సభకు తనను ఆహ్వానించారన్నారు. బీజేపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారన్నారు. మాదిగల ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
Also Read: PM Modi: మహాసభ వేదికపై కంటతడి పెట్టిన మందకృష్ణ.. ఓదార్చిన ప్రధాని మోడీ
ప్రధాని మోడీ మాట్లాడుతూ..” నేను మాటిస్తున్నా.. వర్గీకరణకు కట్టుబడి ఉన్నాను.. దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేస్తా.. న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో కూడా కొనసాగుతోంది.. చట్టపరంగా ఇబ్బందులు లేకుండా చూస్తాం.. అదాలత్ లో కూడా మీకు న్యాయం జరిగాలని కోరుకుంటున్నా.. సామాజిక న్యాయంపై బీజేపీ మాత్రమే సామాజిక న్యాయంపై గ్యారెంటీ ఇస్తుంది. నేను ఆయనకు అసిస్టెంట్‌గా(సహాయకుడిగా) ఉంటాను. నేను మందకృష్ణకు తోడుగా ఉంటాను.” అని మోడీ అన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దళితులను అణిచివేసేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కాంగ్రెస్ వదులుకోదని వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లో పుట్టిన దళిత ఆఫీసర్‌ను కొద్దిరోజుల క్రితం చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా నియమిస్తే కాంగ్రెస్ ఇష్టపడలేదన్నారు. ప్రమాణ స్వీకారాన్ని కూడా వ్యతిరేకించిందంటే కాంగ్రెస్ ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు ఇండియా అనే కూటమిని ఏర్పాటు చేసిందని.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. ఇప్పుడు జాతీయవాదమంటూ జెండా పట్టుకుని తిరుగుతున్నాడని అన్నారు. రాంవిలాస్ పాశ్వాన్‌ను అవమానించడమే కాకుండా రాజ్యసభ సీటు ఇవ్వాలని సమర్థిస్తే నితీష్ వ్యతిరేకించారన్నారు. రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్‌తో నేను కలిసి ఆయన బాధ అర్థం చేసుకున్నానన్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితిన్ రాం దళితుల్లోనే అత్యంత పేద వ్యక్తి.. ఆయన ముఖ్యమంత్రిగా అర్హుడు కాదని నితీశ్ కుమార్ విమర్శలు చేశారని మండిపడ్డారు.
Also Read: PM Modi: బీజేపీ మాత్రమే అణగారిన వర్గాలకు అండగా నిలిచింది..
అవినీతిలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. ఒక ప్రభుత్వం మరొక ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం సహకరించుకోవడం చూశాం.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆప్‌తో వందల కోట్ల లిక్కర్ స్కామ్‌లో అవినీతికి పాల్పడిందన్నారు. ఈ ప్రభుత్వాలు పని, అభివృద్ధిలో కాదు.. కరప్షన్‌లో పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్‌కు మిత్ర పార్టీ ఆప్.. ఆప్‌కు కాంగ్రెస్ మద్దతు తెలుపుతోంది.. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ పైపైన కొట్లాడుకుంటూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయి.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఒకవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీలో ఉంటే.. మరొక వైపు బీజేపీ ఉందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు అధికారం ఉంటే చాలు.. కానీ బీజేపీకి అభివృద్ధి, సామాజిక సాధికారత కావాలన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఎంతో లాభాన్ని బీజేపీ చేకూర్చిందన్నారు.
Also Read: Supreme Court: ‘నేను బతికే ఉన్నా యువర్ హానర్’.. తన హత్య కేసు విచారణలో ప్రత్యక్షమైన బాలుడు..
“స్టాండప్ ఇండియా పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది. ముద్ర లోన్ల ద్వారా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు లబ్ధి చేకూరుతోంది. గత తొమ్మిదేండ్లలో తెలంగాణలోని 13 లక్షల మంది ఎస్సీ విద్యార్థులకు స్కాలర్ షిప్ అందించాం. పీఎం విశ్వకర్మలో భాగంగా బీసీలోని 18 కులాలకు లబ్ధి చేకూర్చేలా పథకాన్ని రూపొందించాం. పేదల కోసం ఉచితంగా రేషన్ ఇస్తున్నాం. ఈ ఏడాది డిసెంబర్‌తో ఈ పథకం ముగియనుంది. కానీ దాన్ని మరో ఐదేండ్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ ఖరీఫ్ సీజన్ లో 20 లక్షల మెట్రిక్ టన్ బాయిల్డ్ రైస్ కొనుగోలు చేస్తాం. కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయొద్దు. తెలంగాణ అభివృద్ధిలో మాదిగ సముదాయానికి జరిగిన అన్యాయంపై ఆవేదన చెందుతున్నాను. నేను ప్రధానిగా మీకు తెలుసు కావచ్చు. కానీ నేను ప్రజల సేవకుడిని.. కానీ బంగారు లక్ష్మణ్ నా గురువు.. నేను ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తిని. నాకు ఆయన ఎన్నో విషయాలు మార్గదర్శనం చేశారు. ఆయన చేతికింద పనిచేశాను. తెలంగాణ మాదిగ సమాజానికి జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నా. 30 ఏండ్లుగా కృష్ణ మాదిగ నిరంతర పోరాటం చేశారుతన యవ్వనాన్ని పోరాటానికి ధారపోశారు. బంగారు లక్ష్మణ్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఎలా పనిచేశానో.. అలాగే మంద కృష్ణ పనిచేశారు. కృష్ణ మాదిగ పోరాటానికి తోడుగా నేనుంటాను. మంద కృష్ణ తల్లిదండ్రులకు నా ప్రణామాలు. వారి త్యాగాన్ని ఈ జాతి మరవదు. 30 ఏండ్ల పాటు అహింసతో సాగిన మీ పవిత్ర పోరాటానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.. అండగా నేనుంటా. మాదిగలకు జరగుతున్న అన్యాయానికి ముగింపు పలికేందుకు కట్టుబడి ఉన్నాను.” అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.