Sunnapu Vasantham: చేవెళ్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సున్నపు వసంతంకు పీసీసీ నుంచి పిలుపు వచ్చింది. టికెట్ రాకపోవడంతో చేవెళ్ల రెబల్ అభ్యర్థిగా సున్నపు వసంతం నామినేషన్ వేసిన సంగతి విదితమే. పీసీసీ పిలుపు మేరకు శనివారం రేవంత్ రెడ్డిని సున్నపు వసంతం కలిశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే సముచిత స్థానం కల్పిస్తామని సున్నపు వసంతంకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Also Read: KA Paul: తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి 80 సీట్లు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని భవిష్యత్తులో రాజకీయంగా మరింత ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్ గెలుపు కోసం కృషి చేయాలని ఆయనకు రేవంత్ సూచించారు. రెబల్‌గా వేసిన నామినేషన్‌ను విత్ డ్రా చేసుకోవాల్సిందిగా సూచనలు చేశారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం 3 గంటలకు చేవెళ్ల పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సున్నపు వసంతం వెల్లడించారు. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తగిన కార్యాచరణ వివరించనున్నట్లు స్పష్టం చేశారు.