Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయమే ఉండటంతో సన్నాహక చర్యలపై ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ నేతృత్వంలోని భారత ఎన్నికల సంఘానికి చెందిన ముగ్గురు సీనియర్ అధికారుల బృందం శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తో పాటు పలువురు ఎన్నికల అధికారులతో సమావేశం అయ్యారు.