India vs England: భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరగనుంది. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌ను 4 వికెట్ల తేడాతో గెలుచుకున్న తర్వాత, టీమిండియా ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. దీనితో కటక్‌లో జరిగే రెండో వన్డే మ్యాచ్ గెలిస్తే భారత్ సిరీస్‌ను గెలుచుకుంటుంది. ఇంగ్లాండ్‌తో జరిగే ఈ వన్డే మ్యాచ్‌లో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ తిరిగి రానున్నాడు. కుడి మోకాలి వాపు కారణంగా విరాట్ కోహ్లీ తొలి వన్డేకు దూరమయ్యాడు. కానీ, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ మాట్లాడుతూ.. రెండవ వన్డేకు పూర్తిగా ఫిట్‌గా, సిద్ధంగా ఉన్నాడని స్పష్టం చేశాడు.
మరోవైపు, ఇంగ్లాండ్‌తో జరిగే రెండో వన్డే మ్యాచ్‌లో అభిమానుల కళ్లు భారత కెప్టెన్ రోహిత్ శర్మపై ఉన్నాయి. రోహిత్ శర్మ చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగులు సాధించడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడు. ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక విషయానికి వస్తే.. తొలి వన్డేలో విరాట్ కోహ్లీ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి వచ్చాడు. దాంతో ఆ మ్యాచ్ లో అతను 36 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. తొలి మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ స్థానంలో అతను జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, గిల్ రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించవచ్చు. కోహ్లీ ఫిట్‌గా ఉన్న తర్వాత జట్టులోకి తిరిగి వస్తే, అతను కొంతకాలంగా పరుగులు సాధించడంలో ఇబ్బంది పడుతున్నందున సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో పేలవమైన ప్రదర్శన తర్వాత కోహ్లీ ఢిల్లీ తరపున రంజీ మ్యాచ్ కూడా ఆడాడు. కానీ, ఆ మ్యాచ్‌లో కూడా అతను ఆరు పరుగులు మాత్రమే చేయగలిగాడు. చూడాలి మరి మొత్తానికి నేడు టీమిండియా గెలిచి సిరీస్ ని గెలుస్తుందో లేదో.