IPL 2025: 500 పరుగులు చేస్తే చాలు.. యువ క్రికెటర్లకు సురేశ్ రైనా కీలక సూచన!
- భారత ఆటగాళ్లకు ఐపీఎల్ మంచి అవకాశం
- ఐపీఎల్ ద్వారా కుర్రాళ్లకు జాతీయ జట్టులో అవకాశం
- యువ క్రికెటర్లకు సురేశ్ రైనా సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ జట్టులోకి రావాలనుకొనే భారత యువ ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చక్కటి అవకాశం. ఐపీఎల్‌లో సత్తా చాటి భారత జట్టులోకి వచ్చిన జాబితా చాలానే ఉంది. సీనియర్లతో పాటు యువ క్రికెటర్లలో కూడా చాలా మంది ఐపీఎల్ ద్వారానే టీమిండియాలోకి వచ్చారు. యువ క్రికెటర్లలో శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌లు ఐపీఎల్ ద్వారానే జట్టులోకి వచ్చారు. కేవలం భారత్‌లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ ఎంతో మందికి జాతీయ జట్టులో అవకాశాలు కల్పించింది. ఐపీఎల్ ద్వారా కుర్రాళ్లకు జాతీయ జట్టులో అవకాశం రావడంపై భారత మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా స్పందించాడు.
కుర్రాళ్లు ఐపీఎల్‌లో రాణిస్తే జాతీయ జట్టులో చోటు ఖాయమని సురేశ్ రైనా పేర్కొన్నాడు. ‘ప్రస్తుతం చాలా మంది యువ క్రికెటర్లు అద్భుతమైన టాలెంట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెడుతున్నారు. టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2024ను గెలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా కూడా నిలిచింది. యువ క్రికెటర్లు కెప్టెన్లుగా ఎదుగుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు కొందరు ఫాస్ట్ బౌలర్లను చూస్తుంటే అర్థమైపోతుంది. ఇప్పుడు కొత్తతరం క్రికెటర్లను మనం చూస్తున్నాం. తిలక్ వర్మ , యశస్వి జైస్వాల్, రింకు సింగ్.. మంచి టాలెంట్ ఉన్న ఆటగాళ్లు వస్తున్నారు. అక్షర్ పటేల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇది భారత జట్టుకు మంచిది’ అని రైనా అన్నాడు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
‘యువ క్రికెటర్లకు ఓ సూచన. వర్తమానంలో ఉండి ఆటపై దృష్టి పెడితే అవకాశాలు అవే వస్తాయి. నిలకడగా ఆడితే ఎప్పటికైనా ఫలితం దక్కుతుంది. ఒక ఐపీఎల్ సీజన్‌లో 500కు పైగా పరుగులు చేస్తే తప్పకుండా జాతీయ జట్టులో చోటు దక్కుతుంది. ప్రతి ఐపీఎల్ సీజన్‌ను సద్వినియోగం చేసుకోవాలి. నిర్భయంగా ఆడుతూ.. టెక్నిక్‌తో పాటు యాటిట్యూడ్‌ను మెరుగుపర్చుకోవాలి. ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీలో సత్తా చాటితే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. భారత ఆటగాళ్లకు ఐపీఎల్ మంచి అవకాశం. ప్రతి ఒక్క యువ క్రికెటర్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి’ అని సురేశ్ రైనా సూచించాడు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!