Rohit Sharma: ఏవేవో ఆలోచనలు.. కాళ్లు, చేతులు ఆడలేదు!
- ఫైనల్‌కు ముందు రోజు తీవ్ర ఒత్తిడికి గురయ్యా
- ఫైనల్‌కు ముందు రోజు రాత్రి నిద్రపోలేదు
- నా మనసంతా ప్రపంచకప్ మీదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికాతో టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌కు ముందు రోజు తీవ్ర ఒత్తిడికి గురయ్యానని అప్పటి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఏవేవో ఆలోచనలతో తన కాళ్లు, చేతులు ఆడలేదని.. ఆ రోజు రాత్రి నిద్రపోలేదని చెప్పాడు. చివరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్ కచ్చితంగా సిక్స్ పోతుందనుకున్నా అని, సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా క్యాచ్‌ను అందుకున్నాడని ప్రశంసించాడు. కీలక సమయంలో రిషబ్ పంత్‌కు గాయం అయిందని కంగారు పడ్డా అని, అయితే బ్యాటర్ల లయను దెబ్బ తీసేందుకు అలా చేశాడని తర్వాత అర్థమైందని రోహిత్ చెప్పుకొచ్చాడు. బార్బడోస్‌లో ఉత్కంఠ భరితంగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి కప్ కైవసం చేసుకుంది.
టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 గెలిచి జూన్ 29కి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా రోహిత్ శర్మ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ‘భారత్ 2011లో ప్రపంచకప్ గెలిచింది. ఆ తర్వాత టీమిండియా ప్రపంచకప్ గెలవలేదు. ఇది 13 ఏళ్ల విరామం. చాలా మంది ఆటగాళ్లకు 13 ఏళ్ల కెరీర్ కూడా ఉండదు. అలాంటి వారికి ప్రపంచకప్ కల నెరవేరదు. నేను 2007 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నా. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌ను మించింది లేదనిపించింది. ఫైనల్ మ్యాచ్ ముందు రోజు రాత్రి నిద్ర పోలేదు. ఏవేవో ఆలోచనలతో నా కాళ్లు, చేతులు ఆడలేదు. నా మనసంతా ప్రపంచకప్ మీదే ఉంది. అదే సమయంలో ఒత్తిడిగా కూడా అనిపించింది. మ్యాచ్ కోసం ఉదయం 9 గంటల కల్లా టీమ్ బయల్దేరాలి, కానీ నేను 7 గంటలకే నిద్రలేచా. నా రూమ్ నుంచి మైదానాన్ని చూస్తూ.. మరో రెండు గంటల్లో మైదానంలో ఉంటాం, ఆపై కొన్ని గంటలకే ఫలితం వస్తుంది. కప్ ఎవరిదో’ అనే ఆలోచనలు నా మదిలో వచ్చాయి’ అని రోహిత్ చెప్పాడు.
Also Read
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
‘ఫైనల్లో చివరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్‌ను సూర్యకుమార్ అద్భుత క్యాచ్‌గా అందుకున్నాడు. అప్పుడే మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. అయితే నేను ఆ బంతి సిక్స్ అనుకున్నా. సూర్య పట్టిన క్యాచ్ సరైనదో లేదో తేల్చడానికి థర్డ్ అంపైర్‌కి ఫీల్డ్ అంపైర్లు పంపారు. ఆ సమయంలో టీమ్ మొత్తం తీవ్ర ఒత్తిడికి గురైంది. సూర్యా అది క్యాచేనా అని నేను అడిగా?. బంతిని బాగా పట్టానని సూర్య చెప్పాడు. రీప్లేలో సూర్య అద్భుతంగా బంతిని అందుకున్నాడని కనిపించింది. అందరం సంతోషంలో మునిగిపోయాం. నిజానికి ఆ క్యాచ్ సూర్య పట్టకుంటే కచ్చితంగా సిక్స్ వెళ్లేదే. కీలక సమయంలో పంత్‌కు గాయం అయిందని కంగారు పడ్డా. కానీ బ్యాటర్ల లయను దెబ్బ తీసేందుకు అలా చేశాడని తర్వాత అర్థమైంది’ అని రోహిత్ తెలిపాడు.
తాజావార్తలు
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!