టీమిండియా మాజీప్లేయర్, లెజెండ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చాడు. ముఖ్యంగా మొదటి టెస్టులో మన బ్యాటర్లు సెంచరీలు చేసిన విధానంపై అసహనం వ్యక్తం చేశాడు. మొదటి టెస్టులో మనవాళ్లు 5 సెంచరీలు చేశారు. కానీ డాడీ హుండ్రేడ్స్ ఎక్కడా.. అని ప్రశ్నించాడు. అవి చేయలేదు కాబట్టే మ్యాచ్ ఓడిపోయారు. అంతే కాదు కొంతమంది బ్యాటర్లు డిఫెన్సివ్ మోడ్ లో బ్యాటింగ్ చేశారు అని ఆరోపించాడు.
READ MORE: Champions League T20 : మళ్ళీ రాబోతున్న టీ20 ఛాంపియన్స్ లీగ్..
“వికెట్లు కాపాడుకోవడం కోసం స్లోగా పరుగులు చేస్తే స్కోర్ వస్తుంది కానీ, విజయం కాదు. 5 సెంచరీలలో కనీసం ఒక్కటైనా 150 లేదా 200 స్కోర్లు లేవు. అందుకే టీమిండియా ఓటమి పాలైంది. ఇక టేయిలెండర్ల నుంచి ప్రతిసారీ పరుగులు ఆశించటం కరెక్ట్ కాదు. వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని పరుగులు యాడ్ చేస్తుంటారు. అవి జట్టుకు ఉపయోగపడినా అన్ని సార్లు వాళ్లపై ఆధారపడటం మంచిది కాదు. ఇక 9,10, 11 స్థానాల్లో ఆడే ప్లేయర్లను తోక బౌలర్లు అంటారు. ఇంగ్లీషులో వీళ్ళని టెయిలెండర్లు అని పిలుస్తారు. ముఖ్యంగా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్లో వాళ్ళు బ్యాటింగ్ చేయాలి, పరుగులు రాబట్టాలి. డాడీ హుండ్రేడ్స్ చేస్తూ దూకుడుగా ఆడాలి. అప్పుడు జట్టుకు విజయావకాశాలు పెరుగుతాయి. ఇక టెయిలెండర్లు చేసే పరుగులు బోనస్ గా భావించాలి. అంతేకాని అతిగా ఆధారపడకూడదు. కాగా బౌలింగ్ లో మనవాళ్ళు చేతులెత్తేసినా.. బ్యాటింగ్ లో మరీ స్లోగా ఎందుకు ఆడుతున్నారు.” అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
READ MORE: Perni Nani: వల్లభనేని వంశీ అరెస్ట్ సునకానంద చర్య.. పేర్ని నాని ఫైర్..