All-Time XI: టీ20 ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్, కోహ్లీకి నో ప్లేస్!
- ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత్ కైవసం
- మూడు మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు పడగొట్టిన వరుణ్
- రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు నో ప్లేస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. టీమిండియా ట్రోఫీ గెలవడంతో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలకపాత్ర పోషించాడు. మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. అద్భుత బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇంటర్వ్యూలో భాగంగా తన టీ20 ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్‌ను వరుణ్ ఎంచుకున్నాడు. అయితే అతడి జట్టులో టీమిండియా స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు అవకాశం ఇవ్వలేదు.
ఇప్పటివరకు ఎవరితో కలిసి ఆడావో వారిలో నుంచే టీమ్ ఎంపిక ఉండాలని వరుణ్ చక్రవర్తికి ఆర్ అశ్విన్ కండిషన్ పెట్టాడు. భారత్ నుంచి ముగ్గురిని ఎంచుకోగా.. అందులో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రాలు ఉన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. 2021 టీ20 ప్రపంచకప్ సమయంలో విరాట్ కోహ్లీ సారథ్యంలో వరుణ్ పొట్టి ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇక 2025 ఆరంభంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆపై ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడాడు. అయినప్పటికీ వరుణ్ జట్టులో వారిద్దరికీ చోటు దక్కలేదు.
Also Read
Also Read: ENG vs IND: అలా ఇంగ్లండ్‌కు రావొద్దు.. కుల్దీప్ యాదవ్‌కు పీటర్సన్ సూచనలు!
వరుణ్ చక్రవర్తి తన డ్రీమ్ టీమ్‌లో జోస్ బట్లర్, ట్రావిస్ హెడ్‌ను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్‌ను మూడో స్థానంలో, నికోలస్ పూరన్‌ను నాలుగో స్థానంలో తీసుకున్నాడు. కీపర్‌గా హెన్రిచ్ క్లాసెన్‌ను ఎంచుకున్న వరుణ్.. ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్య, ఆండ్రీ రస్సెల్‌లకు అవకాశం ఇచ్చాడు. స్పిన్ కోటాలో సునీల్ నరైన్, రషీద్ ఖాన్‌లకు చోటివ్వగా.. పేస్ కోటాలో జస్ప్రీత్ బుమ్రా, మతిశా పతిరనలకు ఎంచుకున్నాడు.
వరుణ్ చక్రవర్తి టీమ్:
జోస్ బట్లర్, ట్రావిస్ హెడ్, సూర్యకుమార్ యాదవ్, నికోలస్ పూరన్, హెన్రిచ్ క్లాసెన్, హార్దిక్ పాండ్య, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, మతిశా పతిరన.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!