టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన కుటుంబంతో కలిసి శుక్రవారం ఫ్రాన్స్‌కు బయలుదేరాడు. తన కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ఫ్రాన్స్‌కు వెళ్లాడు. అయితే.. గౌతమ్ గంభీర్ తన కుటుంబంతో విమానాశ్రయంలో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జాతీయ జట్టులోకి రావాలనుకొనే భారత యువ ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చక్కటి అవకాశం. ఐపీఎల్లో సత్తా చాటి భారత జట్టులోకి వచ్చిన జాబితా చాలానే ఉంది. సీనియర్లతో పాటు యువ క్రికెటర్లలో కూడా చాలా మంది ఐపీఎల్ ద్వారానే టీమిండియాలోకి వచ్చారు. యువ క్రికెటర్లలో శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌లు ఐపీఎల్ ద్వారానే జట్టులోకి వచ్చారు. కేవలం భారత్‌లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ ఎంతో మందికి జాతీయ…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. రూ.58 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనుంది. ఆటగాళ్లతో పాటు సిబ్బంది, సెలక్షన్ కమిటీకి ఈ నగదు అందజేయనున్నట్లు తెలిపింది.
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో తనదయిన ముద్ర వేసిన వ్యక్తి మహేంద్ర సింగ్ ధోనీ. ఫార్మాట్ ఏదైనా సరే భారత జట్టును విజయవంతంగా నడిపించిన ధోనీ, అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. ధోని క్రికెట్ లో సాధించిన రికార్డులు, అవార్డ్స్, విజయాలు అబ్బో.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పవచ్చు. ఇకపోతే, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) మాజీ క్రికెటర్లకు వారి సేవలను గుర్తించి పెన్షన్ అందిస్తోంది. ఆటగాడు ఆడిన మ్యాచులు, భారత…
Rohit Sharma: భారత క్రికెట్ జట్టు ఇటీవల టెస్టు క్రికెట్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయిన సంగతి తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ ఓటమి, అలాగే ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలుపుకోలేకపోవడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ. ఆ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత ప్రదర్శన కూడా తివారంగా నిరాశపరిచింది. ముఖ్యంగా, ఆసీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేయడం అతడి బ్యాటింగ్…
పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్.. 12 ఏళ్ల తర్వాత ట్రోఫీని సొంతం చేసుకుంది. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా రోహిత్ సేన కప్‌ను దక్కించుకుంది. ఇప్పటికే ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ను ప్రకటించింది. భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా తన బెస్ట్ టీమ్‌ను వెల్లడించాడు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ కూడా తన ప్లేయింగ్ 11ను ప్రకటించాడు.…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని భారత్ గెలిచిన విషయం తెలిసిందే. సెమీస్‌లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి.. గత ఐసీసీ టోర్నీ పరాభవాలకు బదులు తీర్చుకుంది. అయితే దుబాయ్‌లోనే అన్ని మ్యాచ్‌లు ఆడడంతోనే.. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిందని పలువురు మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు అన్నారు. పిచ్ అడ్వాంటేజ్ భారత జట్టుకు కలిసొచ్చిందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ వాదనలను ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కొట్టిపడేశాడు. పిచ్ అడ్వాంటేజ్ అనేది అర్థరహితమని, భారత్ బాగా…
దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచి విజేతగా నిలిచింది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవడంలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. దుబాయ్ పిచ్ స్పిన్‌కు అనుకూలించడంతో భారత్ ఏకంగా నలుగురితో బరిలోకి దిగింది. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.. స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఆకట్టుకున్నారు. టోర్నీలో భారత్ స్పిన్నర్లు 26 వికెట్లు తీశారు.…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీస్, ఫైనల్స్‌లో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫైర్ అయిన విషయం తెలిసిందే. బాల్ వేసిన అనంతరం స్టంప్స్ వెనకే ఉండడం, ఫీల్డర్ త్రో విసిరినా బంతిని పట్టుకోకపోవడంతో ఆగ్రహానికి గురయ్యాడు. ఫైనల్ మ్యాచ్‌లో 41వ ఓవర్లో రవీంద్ర జడేజా మెరుపు వేగంతో బంతిని వేయగా.. వికెట్లకు దగ్గర నుంచి వెళ్తున్న బంతిని కుల్దీప్ పట్టుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. సెమీస్‌లో స్టీవ్ స్మిత్…