BCCI Responds Amid Shreyas Iyer ODI Captaincy Rumours: టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు ప్రతిష్టాత్మక ఆసియా కప్ 2025 జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే. ఆసియా కప్‌కు ఎంపికైన భారత జట్టులో అయ్యర్ పేరు లేకపోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది. గొప్ప ఫామ్‌లో ఉన్న ఆటగాడికి బీసీసీఐ సెలెక్టర్లు జట్టులో ఎందుకు అవకాశం ఇవ్వలేదో అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు అయ్యర్‌కు వన్డే కెప్టెన్సీ ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ అనంతరం అయ్యర్‌కు వన్డే సారథ్య బాధ్యతలు ఇచ్చేందుకు బీసీసీఐ కూడా కసరత్తులు మొదలెట్టిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు.
వన్డే సారథ్య బాధ్యతలపై అసలు చర్చే జరగలేదని దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఓ జాతీయ ఛానెల్‌తో దేవజిత్ సైకియా మాట్లాడుతూ… ‘వన్డే సారథ్య బాధ్యతలపై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు నాకూ వినిపించాయి. వన్డే కెప్టెన్సీపై ఎలాంటి చర్చలు జరగలేదు. అలాంటి అలాంటి ఆలోచన మాకు ఇప్పటివరకు లేదు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఉన్నాడు’ అని స్పష్టం చేశారు. వన్డే ఫార్మాట్‌లో శ్రేయస్ అయ్యర్ గణాంకాలను బాగున్నాయి. వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో పరుగులు చేశాడు. దీంతో అయ్యర్ కెప్టెన్ రేసులో బలమైన పోటీ దారుడిగా ఉంటాడనేది కాదనలేని వాస్తవం. అంతేకాదు ఐపీఎల్‌లో రెండు జట్లను అద్భుతంగా నడిపిన అనుభవం ఉంది. ఇది అతడికి కలిసొచ్చే అంశం.
Also Read: Rohit Sharma: ఆస్ట్రేలియా సిరీస్ ముందే బరిలోకి రోహిత్.. హిట్‌మ్యాన్ సర్‌ప్రైజ్ ఎంట్రీ!
అయితే ఇటీవలే టెస్టు కెప్టెన్‌గా ఎంపికైన శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ అండగా ఉందని తెలుస్తోంది. వన్డే కెప్టెన్సీ అతడికే కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ‘వన్డేల్లో శుభ్‌మన్ గిల్ సగటు 59గా ఉంది. ప్రస్తుతం వన్డే జట్టుకు వైస్ కెప్టెన్. ఇటీవలే గిల్ టెస్టు బాధ్యతలు అందుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై విజయవంతం అయ్యాడు. గిల్ కుర్రాడు కావడం కూడా కలిసొచ్చే అంశం. అయితే ఎప్పుడు ఎప్పుడు వన్డే కెప్టెన్ అవుతాడనేది కాలమే నిర్ణయిస్తుంది’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. టీ20 ప్రరపంచకప్ 2026 అనంతరం టీ20 కెప్టెన్సీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ మాదిరి అన్ని ఫార్మాట్‌లకు కెప్టెన్ అవుతాడేమో చూడాలి.