టీమిండియా కెఫ్టెన్ విరాట్ కోహ్లీతో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జైషా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. కోహ్లీ సారథ్యంలోని…. టీమిండియా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్, 2021 టెస్ట్ వరల్డ్ ఛాంపియన్ షిప్ ఓడిపోయింది. దీంతో రాబోయే ఐసీసీ ట్రోఫీలను కచ్చితంగా గెలవాల్సినా వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. టీ-20 ప్రపంచకప్‌కు జట్టు కూర్పుపై కుడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అయితే ఈ ఏడాది…
ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ ను బీసీసీఐ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే భారత్ లో కరోనా కేసులు అధికంగా నమోదవుతుండటంతో ఈ టోర్నీని యూఏఈకి మార్చింది బీసీసీఐ. అయితే తాజాగా ఈ ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల అయింది. అక్టోబర్ 23 న ఈ టోర్నీ ప్రారంభం కానుండగా 24న టీం ఇండియా మొదటి మ్యాచ్ పాకిస్థాన్ తో తలపడుతుంది. ఆ తర్వాత 31న న్యూజిలాండ్ తో నవంబర్ 3న ఆఫ్ఘనిస్తాన్ తో…
భారత్-ఇంగ్లాండ్ మధ్య నిన్న రెండో టెస్ట్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన భారత జట్టులో ఓపెనర్లు అద్భుతంగా రాణించారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(83) పరుగులు చేయగా మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(129) సెంచరీతో రెచ్చిపోయాడు. ఇక ఆ తర్వాత కోహ్లీ(42), జడేజా(40) పంత్(37) పరుగులు చేయగా పుజారా(9), రహానే(1)తో నిరాశపరిచారు. అయితే ఈ ఇన్నింగ్స్ లో ముగ్గురు భారత ఆటగాళ్లు డక్ ఔట్ కాగా…
టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి. ముగింపు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. 39 స్వర్ణాలతో అమెరికా టాప్ ప్లేసు సాధించింది. ఆ తర్వాతి స్థానాలను చైనా, జపాన్ పొందాయి. భారత్ మొత్తం ఏడు పతకాలతో 48వ స్థానంలో నిలిచింది. అసలు జరుగుతాయా, లేదా అన్న సందిగ్ధత నుంచి ఎన్నో అవాంతరాలను అధిగమించి టోక్యో ఒలింపిక్స్ జరిగాయి. ప్రపంచం మొత్తాన్ని కలవరపెట్టిన కరోనా.. ఒలింపిక్స్‌ను కూడా కమ్మేసింది. చివరికి ఏడాది ఆలస్యంగా జరిగిన టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి. ముగింపు వేడుకలను గతంలో…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ మొదటి ఇనింగ్స్ లో 183 పరుగులు చేయగా భారత్ 278 పరుగులు చేసి 95 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టు పుంజుకొని 303 పరుగులు చేసింది. అయితే రెండు ఇన్నింగ్స్ లో కలిపి మొత్తం 20 వికెట్లు భారత పెసర్లే తీయడం విశేషం. ఇక…
గేమ్ ఏదైనా.. మనోళ్లు పతకం కొట్టాల్సిందే అనుకుంటాం. గెలిస్తే… భుజాలకెత్తుకుంటాం. ఓడిపోతే.. నేలకేసి కొడతాం. ఇదే మనకు తెలిసిన పద్ధతి. ఆడేవారికి ప్రోత్సాహాన్నిద్దాం అనే ఆలోచన మాత్రం ఉండదు. విజయం సాధించాలనే ఆకాంక్ష ఎంత బలంగా ఉంటుందో.. గెలవడానికి జరిగే కసరత్తులో కనీస ప్రోత్సాహం ఉండదు. అంతర్ జిల్లా పోటీల నుంచి మొదలుకుని.. అంతర్జాతీయ గేమ్స్ వరకు అన్నింట్లో మనవాళ్లు గెలవాలనుకుంటాం. కానీ దానికి ఓ బలమైన వ్యవస్థ ఉండాలనే వాస్తవాన్ని మాత్రం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తాం. ప్రపంచ…
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలోకి మరో పథకం వచ్చి చేరింది. రెజ్లింగ్ లో భజరంగ్ పూనియా కాంస్యం సాధించాడు. రెజ్లింగ్ పురుషుల 65 కిలోల విభాగంలో ఈ పథకం కైవసం చేసుకున్నాడు. అయితే సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన భజరంగ్ నేడు కాంస్య పథకం మ్యాచ్ లో కజికిస్థాన్ కు చెందిన జైకోవ్ పై ఘన విజయం సాధించాడు. జైకోవ్ పై భజరంగ్ 8-0 తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే దీంతో…
ఒలింపిక్స్ లో భారత్ చరిత్ర ఎప్పుడూ తీసికట్టే. మనతో ఎందులోనూ సరితూగని దేశాలు కూడా విశ్వ క్రీడా వేదికపై తలెత్తుకుని సగర్వంగా నిలబడుతుంటే.. ఇండియా మాత్రం పతకాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాల్సిన దుస్థితి. అడపాదడపా సాధించే విజయాలను అపురూపంగా కళ్లకద్దుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు టోక్యోలో కూడా మహిళలే భారత్ పరువు నిలబెట్టారు. టోక్యో ఒలింపిక్స్ తొలిరోజే వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను రజతం గెల్చింది. దేశ చరిత్రలో ఒలింపిక్స్ తొలిరోజే పతకం రావడం…
టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు పతకాల ఆశలు పెంచుతున్నారు. ప్రధానంగా సింధు, మేరీకోమ్, లవ్లీనా సహా పలువురు క్రీడాకారులు.. ఒక్కో అడుగు ముందుకేస్తూ, అభిమానుల్లో ఆశలు కల్పిస్తున్నారు. మీరా చాను సిల్వర్ మెడల్ తర్వాత మరో మెడల్ కోసం భారత్ ఆశగా ఎదురుచూస్తోంది. ఇవాళ మెన్స్ గోల్ఫ్ సింగిల్స్‌లో అనిర్బన్ లాహిరి, ఉదయన్లు.. రౌండ్ వన్ గేమ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.25 మీటర్ల పిస్టల్ మహిళల విభాగంలో మనుభాకర్, రాహి సర్నబట్.. బరిలో దిగనున్నారు రియో ఒలింపిక్స్…