టీ-20 ప్రపంచకప్‌లో నిరాశాజనక ప్రదర్శనతో భారత టీ20 జట్టు సారధిగా తన కెరీర్ ముగించిన విరాట్ కోహ్లీకి మరో చేదు అనుభవం ఎదురైంది. అంతర్జాతీయ టీ20 బ్యాట్స్‌మెన్ జాబితాలో నాలుగు స్థానాలు కోల్పోయాడు కోహ్లీ. టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశ ముగిసిన తర్వాత అంతర్జాతీయ ర్యాంకుల్లో చాలా మార్పులు వచ్చాయి. వాటిలో కోహ్లీ స్థానం కూడా ఒకటి.
టోర్నీ ప్రారంభానికి ముందు అంతర్జాతీయ టీ20 బ్యాట్స్‌మెన్ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న కోహ్లీ.. లీగ్ దశ ముగిసే సరికి 8వ స్థానానికి పడిపోయాడు. టీ-20లో మూడు ఇన్నింగ్సులు ఆడిన కోహ్లీ 68 పరుగులు మాత్రమే చేశాడు. పాకిస్థాన్ మ్యాచ్‌లో అత్యధికంగా 57 పరుగులు చేశాడు. అంతకు ముందు రెండు ఇన్నింగ్సుల్లో అతను చేసిన పరుగులు కేవలం 11 మాత్రమే. న్యూజల్యాండ్‌పై 9 పరుగులు మాత్రమే చేసిన అతను స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో 2 పరుగులు చేశాడు. దీంతో కోహ్లీ ర్యాంకింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది.