పారాలింపిక్స్ లో భారత్ కు వరుస పతకాలు వస్తున్న వస్తున్న విషయం తెలిసిందే. నిన్న ఒక్క రోజే నాలుగు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు ఈ రోజు కూడా పతకాల వేటను ప్రారంభించారు. పారా బ్యాడ్మింటన్ ఇండియా ప్లేయర్ సుహాస్ యతిరాజ్ రజతం సాధించాడు. సెమిస్ లో అద్భుత ప్రదర్శన చేసి సుహాస్ ఫైనల్స్ కు చేరుకున్నాడు. అయితే ఫైనల్ లో దూకుడుగా వ్యవరించి మొదటి రౌండ్ ను సొంతం చేసుకున్న సుహాస్ ఆ తర్వాతి రెండు…
జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్ నేటితో ముగియనున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి మనదేశ క్రీడాకారులు దుమ్మురేపారు. ఏకంగా పదిహేడు పతకాలు సాధించారు. పారా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులపై.. దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. టోక్యో పారా ఒలింపిక్స్.. భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. నాలుగు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఆరు కాంస్యాలు కలిపి ఏకంగా మన క్రీడాకారులు.. 17 పతకాలు సాధించారు. ఆగస్టు 24న ప్రారంభమైన ఈ పారా…
నాల్గో టెస్టులో భారత బ్యాట్స్మెన్లు…అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఓపెనర్లు రోహిత్, కేఎల్ రాహుల్‌తోపాటు వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ పూజారా…రాణించారు. దీంతో భారత్ 3వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. 171 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ జడేజా క్రీజులో ఉన్నారు. మరో 150 పరుగులు చేస్తే…భారత్ విజయం సాధించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3వికెట్ల నష్టానికి 270…
పారా ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. పతకాలు కొల్లగొడుతూనే ఉన్నారు. అవని లేఖరా… ఒకే పారా ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించారు. పతకాల పట్టికలో ఇండియా 37వ స్థానంలో నిలిచింది. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…ఈ నెల 9న పారా ఒలింపియన్లను కలుసుకోనున్నారు. భారత దేశ బంగారు బాలిక అవని లేఖారా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా పారాలింపియన్‌గా…
మొదటి రెండో టెస్టు వరకూ ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది మన భారత బ్యాట్స్ మెన్ యేనా? అంతగా విరుచుకుపడ్డ వీరు మూడో టెస్ట్ నుంచి ఇలా అయిపోయిరేంటి? ఎందుకిలా పేకమేడలా కుప్పకూలుతున్నారు? అసలు మన భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లకు ఏమైంది. పట్టుమని 10 పరుగులు చేయడానికి ఎందుకింతలా ఆపసోపాలు పడుతున్నారు? ప్రపంచ క్రికెట్లో భారత ప్లేయర్లకు మంచి గుర్తింపు ఉంది. మనోళ్లు బ్యాట్ పట్టారంటే ఫోర్లు.. సిక్సర్లు.. రన్సే రన్స్ అన్న లెవల్లో చెలరేగి పోతుంటారు.…
నేడు భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఓవల్ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ లో టాస్ గెలిచినా ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బౌలింగ్ ఎంచుకోవడంతో టీం ఇండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే గత మూడు టెస్టులలో ఒక్క మార్పు లేకుండా ఆదోని కోహ్లీ సేన ఈ మ్యాచ్ లో రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. పేసర్లు షమీ. ఇషాంత్ స్థానంలో శార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ తుది జట్టులోకి వచ్చారు.…
ఆదాయం పెంపొందించుకోవడంపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. ఐపీఎల్ 2022 ఎడిషన్‌లో కొత్తగా రెండు జట్లకు అనుమతి ఇవ్వడం ద్వారా.. ఏకంగా 5 వేల కోట్లు ఆర్జించనుంది. మరోవైపు.. ఫ్రాంచైజీల కొనుగోలుకు వ్యాపారదిగ్గజాలు పోటీ పడుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ.. భారీ ప్రణాళికలు వేసింది. 2022 ఎడిషన్ ఐపీఎల్లో కొత్తగా రెండు జట్లకు అనుమతి ఇవ్వడం ద్వారా ఏకంగా 5 వేల కోట్లు ఆర్జించనుంది. ప్రస్తుతం ఐపీఎల్లో 8 జట్లు మాత్రమే ఉన్నాయి.…
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో రజత పతకం వచ్చి చేరింది. హైజంప్ లో అథ్లెట్ నిషాద్ కుమార్ ఈ పతకాన్ని సాధించారు. ఈ పతకం సాధించే సమయంలో 2.06 మీటర్లతో నిషాద్ కుమార్ ఆసియా గేమ్స్ రికార్డు ను బ్రేక్ చేసాడు. అయితే ఈ హైజంప్ లో యూఎస్ అథ్లెట్ 2.15 స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అయితే రజతం సాధించిన నిషాద్ కుమార్ కు ట్విట్టర్ వేదికగా ప్రధాని మొదటి శుభాకాంక్షలు తెలిపారు. అయితే…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్ట్ లో టీం ఇండియా ఘోర ఓటమిని చవిచూసింది. ఆతిథ్య జట్టు అయిన ఇంగ్లాండ్ భారత జట్టు మీద ఇన్నింగ్స్ పై 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో 78 పరుగులకే కుప్ప కూలిపోయింది. ఆ తర్వాత తమ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య జట్టు 432 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్(121)…
ఆమె బాలివుడ్ సూపర్ స్టార్…ఆయన క్రికెట్ సూపర్ స్టార్.. కాంబినేషన్ అదిరింది కదా. అనుష్క, కోహ్లీ ఎప్పుడూ సోషల్ మీడియా డార్లింగ్సే. ఈ స్టార్ కపుల్ ఎక్కడికి వెళ్లినా ..ఏం చేసినా అది న్యూసే. అవును మరి వారి చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. ప్రస్తుతం ఈ జంట తమ కూతురుతో కలిసి ఇంగ్లండ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంగ్లండ్ వీధులన్నీ తమవే అన్న లెవెల్లో విహరిస్తున్నారు. లంచ్ డేట్లతో జాలీగా గడుపుతున్నారు. అనుష్క ప్రస్తుతం జిలుగు…