భారత ‘ఏ’ జట్టు ఈ నెలలో సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. దాంతో ఈ రోజు ఇండియాలో జరగనున్న న్యూజిలాండ్ సిరీస్ కు భారత జట్టు ప్రకటించిన బీసీసీఐ సౌత్ ఆఫ్రికా వెళ్లే భారత ‘ఏ’ జట్టు ను కూడా ప్రకటించింది. ఈ పర్యటనలో భారత జట్టు నాలుగు రోజుల మ్యాచ్ లు మూడు ఆడనుంది. ఇందుకోసం 14 మందితో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇక ఈ జట్టుకు ప్రియాంక్ పంచాల్ కెప్టెన్ గా వ్యవరించనుండగా… ఉపేంద్ర యాదవ్ వికెట్-కీపర్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇక గత ఐపీఎల్ 2021 లో బాగా రాణించిన కొంతమంది యువ ఆటగాళ్లకు అలాగే రంజీలో ఆకట్టుకున్న ఆటగాళ్లకు ఇందులో అవకాశం ఇచ్చింది బీసీసీఐ. అయితే ఈ పర్యటన వచ్చే నెల 23న ప్రారంభం కానుంది.
భారత ‘ఏ’ జట్టు : ప్రియాంక్ పంచాల్ (కెప్టెన్), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, బాబా అపరాజిత్, ఉపేంద్ర యాదవ్ (వికెట్-కీపర్), కె గౌతమ్, రాహుల్ చాహర్, సౌరభ్ కుమార్, నవదీప్ సైనీ, ఉమ్రాన్ మాలిక్, ఇషాన్ పోరెల్, అర్వాల్జాన్