India On Russian Oil: ‘‘మీ పర్మిషన్ ఎవడికి కావాలి.?’’ చమురు కొనుగోలుపై యూఎస్‌కు భారత్ కౌంటర్..
- మీ పర్మిషన్ ఎవడికి కావాలి..
- రష్యన్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న భారత్..
- అమెరికా పర్మిషన్ ఇచ్చిందనే వార్తల్ని కొట్టిపారేసిన కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India On Russian Oil: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం చేస్తున్నాయి. ఈ పరిణామాలు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. గత శనివారం ఇజ్రాయిల్-యూఎస్ చేసిన వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించాడు. దీని తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రైయిన్, కువైట్‌లపై దాడులు చేస్తోంది. ఈ దేశాల్లో ఉన్న యూఎస్ మిలిటరీ బేస్‌లపై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగిస్తోంది.
ఈ మొత్తం వ్యవహారంతో చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్మూజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేసింది. దీంతో ఇంధన సంక్షోభం ఏర్పడింది. అయితే, ప్రస్తుతం ఓ వార్త హల్చల్ చేస్తోంది. భారత్‌కు ఒక నెల పాటు రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసే పర్మిషన్‌ను అమెరికా ఇచ్చిందని వార్త కథనాలు వెలువడ్డాయి. దీనిపై భారత్ యూఎస్‌కు కౌంటర్ ఇచ్చింది. ‘‘మార్కెట్‌లో ఎక్కడ తక్కువ ధరలకు ముడి చమురు దొరికితే అక్కడ కొనుగోలు చేస్తామని’’ కేంద్రం శనివారం తెలిపింది.
Also Read
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్‌లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
Read Also: BYD Fast Charging: బై బై ఛార్జింగ్ వెయిట్.. BYD ఫ్లాష్ టెక్‌తో 5 నిమిషాల్లో 400KM రేంజ్
“హార్ముజ్ మార్గంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ, భారతదేశ ఇంధన సరఫరా సురక్షితంగా మరియు స్థిరంగా ఉంది. భారతదేశం తన ముడి చమురును 27 నుండి 40 దేశాల నుంచి కొంటుంది. బహుళ ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను నిర్ధారిస్తుంది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, భారతదేశం అత్యంత పోటీతత్వం, సరసమైన ధరలు అందుబాటులో ఉన్న చోట నుండి చమురును కొనుగోలు చేస్తుంది” అని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. చమురు కొనుగోళ్ల కోసం భారత్ కు ఏ దేశం నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రష్యన్ ఆయిల్ కొనుగోలు కోసం భారత్ ఎప్పుడూ ఏ దేశం అనుమతిపై ఆధారపడలేదని చెప్పింది.
ఫిబ్రవరి 2026లో కూడా భారత్ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంది. రష్యా ఇప్పటికీ భారత్‌కు అతిపెద్ద ముడి చమురు ఎగుమతిదారుగా ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది. యూఎస్, యూకే, యూరప్ దేశాల అభ్యంతరాలను పట్టించుకోలేదు. ప్రస్తుతం భారత్ వద్ద 250 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయి. ఇది 7-8 వారాలకు సరపడే బఫర్ స్టాక్. ప్రస్తుతం, దేశంలో చమురు సంక్షోభం లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది.
#HormuzRoute पर बढ़ते तनाव के बावजूद भारत की ऊर्जा आपूर्ति सुरक्षित और स्थिर है।
भारत ने अपने कच्चे तेल के स्रोत 27 से बढ़ाकर 40 देशों तक विविधीकृत किए हैं, जिससे आपूर्ति के कई वैकल्पिक मार्ग सुनिश्चित हुए हैं।
राष्ट्रीय हित में भारत वहीं से तेल खरीदता है जहाँ सबसे प्रतिस्पर्धी… pic.twitter.com/N9Dmy05puz
— पीआईबी हिंदी (@PIBHindi) March 7, 2026
తాజావార్తలు
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?