యూఏఈ లో బీసీసీఐ నిర్వహిస్తున్న ఐసీసీ ప్రపంచ కప్ నుండి భారత జట్టు నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 17 నుండి టీం ఇండియా న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లో తలపడనుండగా… దానికి తాజాగా జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే ప్రపంచ కప్ ముగిసిన వెంటనే టీ20 ఫార్మటు లో కోహ్లీ కెప్టెన్సీ నుండి తప్పుకోవడంతో ఆ బాధ్యతలు ఇప్పుడు ఎవరు చెప్పటనున్నారు అనే ప్రశ్నకు బీసీసీఐ సమాధానంగా రోహిత్ శర్మను కెప్టెన్ గా ప్రకటించింది. ఇక వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ను ఎంపిక చేసింది. ఇక ఈ జట్టులో వెంకటేష్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్ వంటి వారిని అనూహ్యంగా ఎంపిక చేయగా.. శిఖర్ ధావన్, కుల్దీప్ యాదవ్ వంటి వారిని ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక విరాట్ కోహ్లీ, బుమ్రా వంటి వారికి విశ్రాంతిని ఇవ్వడం కోసం ఈ సిరీస్ కు ఎంపిక చేయలేదు అనేది తెలుస్తుంది.
భారత జట్టు : రోహిత్ శర్మ (c), కేఎల్ రాహుల్ (vc), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (wk), ఇషాన్ కిషన్ (wk), వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అశ్విన్, అక్షర్ పటేల్ , అవేష్ ఖాన్, భువనేశ్వర్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, సిరాజ్