టీ20 ప్రపంచ కప్‌లో అసలు పోరు ప్రారంభానికి ముందు టీమిండియా అదరగొట్టింది. ఇప్పటికే తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో బలమైన ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన భారత్.. బుధవారం జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు వార్నర్ (1), ఫించ్ (8) ఘోరంగా విఫలమయ్యారు. మిచెల్ మార్ష్…
ప్రస్తుతం యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగుతోంది. ఈ టోర్నీ తర్వాత టీ20లకు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనున్నాడు. దీంతో కోహ్లీ తర్వాత భారతజట్టు పగ్గాలు చేపట్టేది ఎవరంటూ కొన్నిరోజులుగా చర్చ నడుస్తోంది. కొందరు రోహిత్ అని అంటుంటే.. మరికొందరు రాహుల్‌కు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ చిక్కుముడికి సమాధానం దొరికేసింది. టీ20లకు భవిష్యత్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అని ఓ బీసీసీఐ అధికారి ఇన్సైడ్ స్పోర్ట్ అనే ఛానల్‌కు…
టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్‌లో ఇటీవల కొత్తగా ప్రారంభించిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ మ్యూజియంలో ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హాలీవుడ్ యాక్షన్ కింగ్ జాకీ చాన్, ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్, నటుడు టామ్ క్రూజ్ వంటి ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి. కాగా అక్టోబరు 14న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియాన్ని అక్కడి నిర్వాహకులు…
వైట్ బాల్ క్రికెట్ నుంచి ఐపీఎల్ దాకా.. క్రికెట్ చాలా మారింది. క్రికెట్ ను ఓ క్రీడగా చూసే రోజులు పోయి.. భారీ ఎంటర్ టైన్ మెంట్ బిజినెస్ జరిగే రోజులొచ్చేశాయి. ముఖ్యంగా ఐపీఎల్ రాకతో మార్కెట్ లెక్కలన్నీ తారుమారయ్యాయి. 58 బిలియన్లు.. ఇదీ ఇండియాలో మొత్తం క్రీడల పేరుతో జరుగుతున్న బిజినెస్. దీనిలో 87 శాతం వాటా కేవలం క్రికెట్ దే. ఈ గణాంకాలు చూస్తే చాలు.. దేశంలో క్రికెట్ మానియా ఏ స్థాయిలో ఉందో…
యుఎఇలో ఈరోజు ప్రారంభం కానున్న టీ 20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత జట్టు ప్రధాన కోచ్ గా శాస్త్రి పదవీకాలం ముగియనుంది. దాంతో తర్వాత కోచ్ బాధ్యతలు ది వాల్ రాహుల్ ద్రావిడ్ తీసుకోనున్నట్లు నినట్టి నుండి ప్రచారం జరుగుతుంది. అయితే ఐపీఎల్ 2021 ముగిసిన తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరియు సెక్రటరీ జే షాతో సమావేశమై… ఈ బాధ్యతలు స్వీకరించడానికి ద్రావిడ్ ను ఒప్పించారని వార్తలు వచ్చాయి. అయితే టీం ఇండియా తర్వాతి…
టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ అయితే బాగుంటుంది అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది.. అందుకు ప్రధాన కారణం ఇండియా ఏ మరియు అండర్ 19 జట్లను ఆయన నడిపిస్తున్న తీరే కారణం.. ఇక, ఏ వివాదాల జోలికి పోని వ్యక్తి.. మరోవైపు, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో మంచి సంబంధాలు కలిగిన వ్యక్తి కూడా.. అదే ఇప్పుడు మిస్టర్ డిపెండబుల్ ను టీమిండియా హెడ్ కోచ్ పదవికి చేరువ చేసింది.. త్వరలోనే ప్రస్తుత కోచ్…
భారత క్రికెట్ టీమ్ ప్రధాన కోచ్‌గా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌ను నియమించింది బీసీసీఐ.. 2023 వరల్డ్ కప్ ముగిసే వరకు టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు నిర్వహించనున్నారు.. ఇక, ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి… టీ-20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కోచ్ పదవికి రాజీనామా చేశాయనున్నారు.. ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్ ద్రవిడ్‌తో సమావేశమైన సౌరవ్ గంగూలీ, జయేషా.. దీనిపై చర్చించారు… ఇక, పరాస్ మాంబ్రేను…
2021 టీ 20 ప్రపంచ కప్ నేపథ్యంలో టీమిండియా జట్టుకు మెంటర్ గా మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని పని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే… ఈ ఏడాది టీ-20 వరల్డ్ కప్‌కు టీమిండియా మెంటర్‌గా ఎంపికైన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఒక్క రూపాయి కూడా తీసుకోవడంలేదని సమాచారం. గౌరవ వేతనం తీసుకోకుండానే మెంటార్‌గా పనిచేసేందుకు ధోని అంగీకరించారని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు. కెప్టెన్‌గా ఎంతో అనుభవం ఉన్న ధోని… టీమిండియాకు ఎంతో…
టీ 20 వరల్డ్ కప్ లో పాల్గొన్న టీమిండియా ప్లేయర్ల కొత్త జెర్సీలను ఇవాళ విడుదల చేసింది బీసీసీఐ. దుబాయ్ లో జరుగబోయే టీ 20 వరల్డ్ కప్ లో కోహ్లీ సేన ఈ కొత్త జెర్సీలోనే కనిపించనుంది. బిలియన్ చీర్స్ జెర్సీ అన్న నినాదం తో కొత్త దుస్తులను రిలీజ్ చేసింది బీసీసీఐ. క్రికెట్ అభిమానుల చీర్స్ ప్రేరణ తో జెర్సీలను రూపిందించినట్లు బీసీసీఐ తన ట్విట్టర్ లో వెల్లడించింది. టీమిండియా జట్టుకు కిట్ స్పాన్సర్…
అక్టోబర్ 17 వ తేదీ నుంచి టీ 20 ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే అన్ని టీమ్స్.. ఈ టోర్నీ కోసం సన్నద్దం అవుతున్నాయి. ఈ నేపథ్యం లో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీ 20 ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో బీసీసీఐ ఓ కీలక మార్పు చేసింది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో మరో ఆల్ రౌండర్ శార్దుల్ ఠాకూర్ ను…