కేఎల్ రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆరంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తొడ కండరాల గాయంతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో కేఎల్ రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. తొలి టెస్టుకు విరాట్ కోహ్లీ దూరంగా ఉండనుండగా.. టెస్టు సిరీస్‌కు రోహిత్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా దూరం కావడం టీమిండియాకు పెద్ద దెబ్బ అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ టెస్టు జరగనుండటంతో టీమిండియాకు ఇది కీలకమైన మ్యాచ్. నవంబర్ 25 నుంచి కాన్పూర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు జరగనుంది.
తొలి టెస్టుకు టీమిండియా జట్టు: రహానె (కెప్టెన్), పుజారా (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వృద్ధిమాన్ సాహా, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసీద్ కృష్ణ
Also Read
NEWS – Suryakumar Yadav replaces KL Rahul in India's Test squad.
KL Rahul has sustained a muscle strain on his left thigh and has been ruled out of the upcoming 2-match Paytm Test series against New Zealand.
More details here –https://t.co/ChXVhBSb6H #INDvNZ @Paytm pic.twitter.com/uZp21Ybajx
— BCCI (@BCCI) November 23, 2021
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!