టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మంచి ఫినిషర్ అనే ముద్ర వేయించుకున్నాడు. అతడు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పటివరకు ధోనీ తరహాలో ఆడే ఫినిషర్ కోసం టీమిండియా గాలిస్తూనే ఉంది. అయితే తాజాగా టీమిండియాకు ధోనీ తర్వాత మరో ఫినిషర్ దొరికేశాడని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఫినిషింగ్ ఇన్నింగ్స్‌లు ఆడిన దినేష్ కార్తీక్ ధోనీ స్థానంలో ఫినిషర్ రోల్ పోషించగలడని తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌లో దినేష్ కార్తీక్…
అప్పటివరకు టీమిండియాకు ఫాస్ట్ బౌలింగ్ వేసే సరైన అల్ రౌండర్ లేడు. ఇర్ఫాన్ పఠాన్ తర్వాత అంతటి మేటి ఆటగాడు జట్టుకు కరువయ్యారు. అయితే అది 2015 IPL టోర్నీలో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన ఒక బక్క పలచని కుర్రాడు ఆ సీజన్ లో అదరగొట్టేశాడు. అటు బౌలింగ్ లో ఇటు ధనాధన్ బ్యాటింగ్ లో అందరిని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ జట్టుకు కీలక ఆల్ రౌండర్ గా మారిపోయాడు. ఏడాది తిరిగే…
త్వరలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. గత ఏడాది అర్ధంతరంగా ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు ఐదో టెస్టు ఆడనున్నాయి. అయితే గతంలో ఫామ్ కోల్పోయిన పుజారా ఏకంగా జట్టులో స్థానం కోల్పోయాడు. అతడు తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో దేశవాళీ మ్యాచ్‌లు ఆడుతూ ఫామ్ అందుకున్నాడు. వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్‌లో పుజారా స్థానంలో విహారి మంచి ప్రదర్శన చేశాడు. దీంతో తుది జట్టులో స్థానం కోసం పుజారా, హనుమా విహారి మధ్య…
IPL లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి మాత్రం కనీసం ప్లేఆఫ్స్ కు కూడా అర్హత సాధించలేదు. ఈ సీజన్ లో 14 మ్యాచ్‌లు ఆడిన CSK కేవలం 4 మాత్రమే గెలిచి, లీగ్ స్టేజీలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక IPL ముగిసిన తర్వాత ధోని తన స్వస్థలం జార్ఖండ్ కు వెళ్లిపోయాడు. అయితే ధోని ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నాడు. మహీపై బీహార్ లో FIR నమోదైంది. చెక్…
ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ లో భారత పురుషుల జట్టును దురదృష్టం వెంటాడింది. సూపర్ 4 లో భాగంగా మంగళవారం దక్షిణ కొరియా తో జరిగిన మ్యాచ్ ను భారత జట్టు 4-4తో డ్రాగా ముగించింది. తప్పక గెలవాల్సిన చోట భారత్ జట్టు మ్యాచ్ ను డ్రా చేసుకోవడంతో గోల్స్ తేడాతో ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. మరో మ్యాచ్ లో జపాన్ పై మలేసియా విజయం సాధించింది. దాంతో మలేసియా, దక్షిణ కొరియా, భారత్ జట్లు…
సెంచరీలకు అతను పెట్టింది పేరు. రికార్డులకు అతను రారాజు. చేసింగ్ లో అతను బ్యాటింగ్ కి వచ్చాడంటే సెంచరీ పక్కా అనుకొనే ఫామ్ అతనిది అతనే రన్ మిషన్ విరాట్ కోహ్లీ. అయితే ఇవన్నీ ఒకప్పటి మాట. ప్రస్తుతం కోహ్లీ ఫామ్ లేక సతమతమవుతున్నాడు. ప్రస్తుత ఫామ్ ని చూసి విరాట్ కోహ్లీని విమర్శించడం ఆపాలని పాకిస్థాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ మాజీ క్రికెటర్లకు సూచించాడు. విరాట్ కోహ్లీ దిగ్గజ క్రికెటరని, అతనికి కనీస గౌరవం…
దక్షిణాఫ్రికాతో జూన్ 9 నుంచి సొంతగడ్డపై జరగనున్న ఐదు టీ20ల సిరీస్ కోసం సెలక్టర్లు భారత జట్టును ప్రకటించారు. ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చారు. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను సెలక్టర్లు ప్రకటించారు. ఐపీఎల్లో ఆకట్టుకున్న ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా, వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌లకు చాలాకాలం తర్వాత టీమిండియాలో స్థానం లభించింది. హార్డిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడంతో…
టీమిండియాకు చెందిన మరో ఆటగాడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ జూన్ 1న ఆగ్రాలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది దుబాయ్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో దీపక్ చాహర్ తన గర్ల్ ఫ్రెండ్ జయ భరద్వాజ్‌కు ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, అప్పటి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్రత్యేకంగా…
ఐపీఎల్ తర్వాత టీమిండియా సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లకు ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. రోజురోజుకు గాయాల బారిన పడిన టీమిండియా ఆటగాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఆల్‌రౌండర్లు దీపక్ చాహర్, రవీంద్ర జడేజాలతో పాటు సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా గాయాల కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరం అయ్యారు. ఇప్పుడు తాజాగా స్టార్ పేసర్ హర్షల్ పటేల్ కూడా ఈ జాబితాలో చేరాడు. CSK: ఒక్కడు దూరమైతే.. ఇంత…
ఐపీఎల్ తర్వాత వరుస సిరీస్‌లతో టీమిండియా బిజీ బిజీగా గడపనుంది. తొలుత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత జట్టు తలపడనుంది. జూన్ 9 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌లో టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. ఎందుకంటే జూన్ తొలివారంలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు కూడా వెళ్లాల్సి ఉంది. ఈ కారణంగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు టీమిండియా స్టార్ ఆటగాళ్లు దూరంగా ఉండనున్నారు. అంతేకాకుండా కోచ్ రాహుల్ ద్రవిడ్…