రాజ్‌కోట్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న నాలుగో టీ20లో టీమిండియాలో మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. యువ పేసర్ అవేష్ ఖాన్ స్థానంలో అర్ష్ దీప్ సింగ్ తుది జట్టులోకి రానున్నాడు. వైజాగ్ వేదికగా జరిగిన గత మ్యాచ్‌లో అవేష్ ఖాన్ గాయపడ్డాడు. అతడి చేతి వేలికి గాయమవ్వడంతో మ్యాచ్ మధ్యలోనే డగౌట్‌కు చేరాడు. ఈ క్రమంలోనే అవేష్ ఖాన్ నాలుగో టీ20కి దూరం కానున్నాడు. కాగా ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన అవేష్ ఖాన్ పెద్దగా రాణించిందేమీ లేదు.…
భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తప్పుకున్న నాటి నుంచి టీమిండియాకు ఇప్పటివరకు ఒకే ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఏడాది నుంచి చూస్తే టీమిండియాకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, ఆజింక్యా రహానె, రిషబ్ పంత్, హార్డిక్ పాండ్యా కెప్టెన్లుగా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకే సమయంలో రెండు పర్యటనలకు వెళ్లడం, సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం, పలువురు గాయపడటం వంటి పరిస్థితుల కారణంగా ఏడుగురు కెప్టెన్లు పనిచేయాల్సి వచ్చింది. గత…
భారత పర్యటనను దక్షిణాఫ్రికా జట్టు తెగ ఆస్వాదిస్తోంది. ఏ మాత్రం పసలేని భారత బౌలింగ్ ను సునాయాసంగా ఎదుర్కొంటూ వరుసగా రెండు టీ20ల్లో విజయ దుందుభి మోగించింది. తొలి టీ20లో భారత్ 200పైన స్కోరు చేస్తే దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఊది పారేశారు. రెండో టీ20లో మనోళ్లు 150 కూడా చేయలేదు.. అంతేకాదు ఆరంభంలోనే 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలో నెట్టారు.. గెలుపుపై ఆశలు రేపారు. కానీ ఆఖరికి ఫలితంలో ఎలాంటి మార్పు లేదు. మళ్లీ గెలిచింది…
కటక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు మాత్రమే చేయగలిగారు.ఇషాన్ కిషన్(34), శ్రేయాస్ అయ్యర్ (40) మినహా మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు షాకుల మీదు షాకులు తగిలాయి. రుతురాజ్ గైక్వాడ్ (1), రిషబ్ పంత్ (5), హార్డిక్ పాండ్యా (9), అక్షర్ పటేల్(10) ఇలా వచ్చి అలా వెళ్లారు. టీమిండియా 140…
తొలి టీ20 మ్యాచ్‌లో ఓడిన భారత్ జట్టు.. ఈరోజు కటక్‌లో జరగనున్న రెండో టీ20లో గెలిచి సిరీస్‌లో పుంజుకోవాలని ఆశిస్తోంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈరోజు రాత్రి జరగనున్న రెండో టీ20లో మొదట టాస్ గెలిచినా సఫారీలు ఫీల్డింగ్ ఎంచుకొని ,భారత్ ని బ్యాటింగ్ కి ఆహ్వానించింది. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందే వర్షం ముప్పు ఉన్నట్టు తెలుస్తోంది. గత గురువారం ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో గెలిచిన దక్షిణాఫ్రికా టీమ్..…
యూరోప్‌లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ 2021-22లో టీమిండియా ఒలంపిక్ విజేత బెల్జియంను చిత్తు చేసింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లూ 3-3 స్కోరుతో సమంగా నిలిచాయి. అయితే పెనాల్టీ షూటౌట్లో టీమిండియా 5-4తో విజయం సాధించింది. నిర్ణయాత్మక గోల్‌ను కీపర్ పీఆర్ శ్రీజేష్ అడ్డుకోవడంతో టీమిండియాకు విజయం దక్కింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానానికి చేరుకుంది. నెదర్లాండ్స్ 28 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా టీమిండియా 27 పాయింట్లు సాధించింది. మొదటి…
వరుసగా 13 మ్యాచులు గెలిచి, ప్రపంచ రికార్డు విజయం సాధించాలనుకున్న టీమిండియా ఆశ నెరవేరలేదు. తొలి T20 ముందు వరకు కూడా 12 విజయాలతో పొట్టి ఫార్మాట్ లో అత్యధిక వరుస విజయాలు సాధించిన అఫ్గానిస్తాన్, రొమేనియాలతో కలిసి సమానంగా ఉన్న భారత్ జట్టుకు దక్షిణాఫ్రికా రూపంలో కళ్లెం పడింది. దాంతో వరుస విజయాల రికార్డును తన పేరిట లిఖించుకోలేకపోయింది. ఇక రేపు జరిగే రెండో T20 కోసం భారత జట్టు సిద్ధం అవుతోంది. ఒడిశా వేదికగా…
టీమిండియా జట్టుకు గాయాలు, వైఫల్యాలతో కొంత కాలం పాటు దూరమైన హార్థిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికాతో సిరీస్ తో మళ్లీ చోటు సంపాదించుకున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్ఇండియాలో చోటు కోల్పోయి తిరిగి బలంగా వచ్చాడు ఈ ఆల్‌రౌండర్. అయితే అందుకోసం ఎన్నో త్యాగాలు చేసినట్లు చెప్పొకొచ్చాడు పాండ్యా. జట్టుకు దూరమైనప్పుడు తాను చేసిన కృషి.. తనకు ఇటీవలి విజయాల కంటే ఎక్కువ ఆనందాన్నిచ్చినట్టు చెప్పాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వచ్చిన అవకాశాన్ని పాండ్యా పూర్తిగా సద్వినియోగం…
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఖంగుతింది. భారీ స్కోరు చేసినా బౌలర్ల వైఫల్యంతో పరాజయం మూటగట్టుకుంది. భారత్ నిర్దేశించిన 212 పరుగుల టార్గెట్‌ను దక్షిణాఫ్రికా జట్టు 19.1 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆ జట్టు ఆటగాళ్లు డుస్సెన్ 75 నాటౌట్, డేవిడ్ మిల్లర్ 64 నాటౌట్ చెలరేగి ఆడారు. ఓపెనర్లు డికాక్ (22), బవుమా (10) విఫలమైనా 10 ఓవర్లలో మూడు వికెట్ల…
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో భారత కుర్రాళ్లు కుమ్మేశారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముఖ్యంగా ఓపెనర్ ఇషాన్ కిషాన్ 76 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్…