ICC Rankings: జింబాబ్వేపై వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్.. టీమిండియా ర్యాంక్ పదిలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC Rankings: ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకులను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులేకుండా టీమిండియా తన మూడో ర్యాంకును నిలబెట్టుకుంది. ఇటీవల జింబాబ్వేతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌ను క్వీన్‌స్వీప్ చేసిన భారత్ మరో మూడు రేటింగ్ పాయింట్లను ఖాతాలో వేసుకొని 111 పాయింట్లతో తమ ర్యాంకును మరింత పదిలం చేసుకుంది. మరోవైపు నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన పాకిస్థాన్ సైతం ఒక పాయింట్‌ను పెంచుకుని 107 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. వన్డే ర్యాంకుల్లో న్యూజిలాండ్ (124) అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లండ్ 119 పాయింట్లతో రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు వరుసగా 5, 6 స్థానాల్లో కొనసాగుతున్నాయి.
Read Also: Ajay Mishra: రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి..
Also Read
- Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
- Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
- Asian Games Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో భారత్‌కు సావన్ బర్వాల్ రజతం
- Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
ప్రస్తుతం టీమిండియా ఆసియాకప్ ఆడేందుకు యూఏఈ చేరుకుంది. ఆగస్టు 27న టోర్నీ ప్రారంభం కానుండగా.. ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆగస్టు 28న పాకిస్థాన్‌తో జరిగే హైఓల్టేజ్ మ్యాచ్‌తో భారత్ తమ పోరును ప్రారంభించనుంది. ఈ క్రమంలో వారం రోజుల ముందుగానే యూఏఈ చేరిన టీమిండియా టైటిలే లక్ష్యంగా సన్నాహకాలను ప్రారంభించనుంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు మూడు రోజులు భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించనున్నారు. కాగా ఆసియా కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్ బరిలోకి దిగనుంది.

తాజావార్తలు
-
Maruti Suzuki: దేశంలోనే చౌకైన CNG కారు.. కానీ కొనుగోళ్లు మాత్రం ‘సున్నా’..
-
Chiranjeevi – Odela Movie: ‘కాకా’ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా డౌటేనా?.. మెగా కాంబోపై సస్పెన్స్!
-
CJP: భారత్ మరో బంగ్లాదేశ్ కావాలనుకుంటున్నారా.? సీజేపీ అభిజిత్ దీప్కే డిమాండ్ ఏంటి..
-
INDIA Bloc: 30న ఇండియా కూటమి కీలక భేటీ.. ‘సర్’పై భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-
Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?