ఐపీఎల్ కారణంగా అలసిపోతున్న, గాయపడిన భారత ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో ఉంది. త్వరలో కీలక ఇంగ్లండ్ పర్యటన, టీ20 ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో కనీసం మూడు వారాల పాటు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. ఐపీఎల్ ముగియగానే జూన్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు టీమిండియా జట్టుకు సీనియర్ ఆటగాళ్లు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కేఎల్…
ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం టీమిండియా ఆస్ట్రేలియాకు పయనం కానుంది. త్వరలోనే భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించనుంది. మరోవైపు ఈ ఏడాదంతా టీమిండియా బిజీ బిజీ షెడ్యూల్‌తో గడపబోతోంది. ప్రస్తుతం భారత ఆటగాళ్లు ఐపీఎల్ ఆడుతున్నారు. ఇది ముగిసిన వెంటనే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో…
ఈ ఏడాది ఐపీఎల్లో విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలు కొనసాగుతున్నాయి. రన్ మెషిన్‌గా పేరు తెచ్చుకున్న కోహ్లీ ఈ స్థాయిలో తంటాలు పడుతుండటం కెరీర్లో బహుశా ఇదే తొలిసారి. దీంతో కోహ్లీ వైఫల్యంపై విమర్శలు వస్తున్నాయి. ఒకరకంగా కోహ్లీ టీమ్‌కు భారంగా మారాడనే చెప్పాలి. ఓపెనర్‌గా వచ్చినా, వన్‌డౌన్‌లో వచ్చినా.. బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కడా వచ్చినా కోహ్లీ సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అవుతున్నాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది ఐపీఎల్లో 9 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ…
టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ అరుణ్ లాల్ 66 ఏళ్ల లేటు వయసులో పెళ్లి పీటలెక్కనున్నాడు. అయితే ఆయనకు ఇది మొదటి పెళ్లి కాదు.. రెండో పెళ్లి. ఈ మేరకు మే 2న తన చిరకాల మిత్రురాలైన బుల్ బుల్ సాహా(38)ను అరుణ్‌లాల్ కోల్‌కతాలో వివాహం చేసుకోనున్నాడు. అయితే అరుణ్‌లాల్, బుల్ బుల్ సాహా మధ్య వయస్సు 30 ఏళ్లు ఉండటం గమనించాల్సిన విషయం. బెంగాల్ రంజీ జట్టు ప్రస్తుత కోచ్‌గా వ్యవహరిస్తున్న అరుణ్ లాల్‌కు…
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో టీమిండియా ఆల్రౌండన్ హార్డిక్ పాండ్యా నేతృత్వం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల ద్వారా పాయింట్ల పట్టికలో ఆ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. హార్డిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ వదిలేయడం గుజరాత్ టైటాన్స్‌కు కలిసొచ్చిందనే చెప్పాలి. మహా జట్లను తోసిరాజని టైటిల్ రేసులో గుజరాత్ టైటాన్స్ దూసుకుపోతుందంటే దానికి కారణం హార్డిక్ పాండ్యానే. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ ప్లేస్మెంట్లలోనూ అతడు తనదైన మార్క్…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. గతంలో విరాట్ కోహ్లీ మాదిరిగా వరుస పరాజయాలను చవి చూస్తున్నాడు. ఈ సీజన్లో ముంబై టీమ్ వరుసగా ఆరు పరాజయాలను మూటగట్టుకుంది. దీంతో రోహిత్ కెప్టెన్సీపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతంలో ఐపీఎల్ విజయాల కారణంగానే అతడికి టీమిండియా కెప్టెన్సీ అవకాశం వచ్చిందనేది అక్షర సత్యం. మరి ఇప్పుడు రోహిత్ వరుసగా విఫలం అవుతున్న నేపథ్యంలో రానున్న టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ టీమిండియాను ఎలా…
2011లో సరిగ్గా ఇదే రోజు (ఏప్రిల్ 2) కోట్లాది మంది భారతీయుల కల నెరవేరింది. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా రెండో సారి ప్రపంచ విజేతగా నిలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత జట్టు వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. తమ సీనియర్ ఆటగాడు సచిన్‌కు అందమైన బహుమతిని అందజేసింది. భారత్ వేదికగా జరిగిన ఈ ప్రపంచకప్‌లో భారీ అంచనాల నడుమ టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. లీగ్ దశలో బంగ్లాదేశ్‌తో తమ…
ఎన్నో ఆశలతో న్యూజిలాండ్ వెళ్లిన భారత మహిళా క్రికెట్ జట్టు రిక్త హస్తాలతో స్వదేశానికి వచ్చేస్తోంది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆదివారం నాడు దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలై.. తద్వారా వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ టీమ్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఓడినప్పటికీ చివరి వరకూ మన మహిళలు పోరాడిన తీరు అద్భుతమని రాహుల్ గాంధీ కొనియాడారు. ప్రపంచకప్…
పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియాకు ఇది నిజంగా చేదువార్తే. ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా వైట్ వాష్‌కు గురైన చోట బంగ్లాదేశ్ మాత్రం చరిత్ర సృష్టించింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుని దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ విజయం సాధించింది. బుధవారం రాత్రి సెంచూరియన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా ఒక్క మ్యాచ్…
ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అదరగొట్టాడు. ఇటీవల శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో రాణించిన జడేజా ఆల్‌రౌండర్ల కేటగిరీలో 385 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్ స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ రెండో స్థానానికి పడిపోయాడు. అశ్విన్ (భారత్) మూడో స్థానంలో, షకీబుల్ హసన్ (బంగ్లాదేశ్) నాలుగో స్థానంలో, బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. బ్యాటింగ్ కేటగిరీలో ఆస్ట్రేలియా ఆటగాడు లబుషేన్ 916…