ICC T20 World Cup Trophy: గెలిచిన జట్టుకు ఇచ్చే కప్పు ఒరిజినల్ కాదా? వరల్డ్ కప్ ట్రోఫీ వెనుక ఉన్న అసలు కథ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC T20 World Cup Trophy: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరుకు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఎలాగైనా కప్పు గెలవాలని ఇరు జట్లు తాపత్రయపడుతున్నాయి. అయితే.. ఇంతకీ ఈ టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ ఎక్కడ తయారైందో తెలుసా? ఈ ట్రోఫీ రాజస్థాన్‌లోని జైపూర్‌లో రూపుదిద్దుకుంది. జైపూర్‌కు చెందిన ట్రోఫీ రూపకర్త అమిత్ పబువాల్ (Amit Pabuwal) ఈ ట్రోఫీని తయారు చేశారు. మొదట ఈ ట్రోఫీకి సంబంధించిన రూపకల్పన ఆలోచనను ఆస్ట్రేలియాకు చెందిన Minale Bryce రూపొందించారు. ఆ రూపకల్పన ఆధారంగా తుది ట్రోఫీని తయారు చేసే బాధ్యతను అంతర్జాతీయ క్రికెట్ మండలి అయిన ఐసీసీ అమిత్ పాబువాల్‌కు అప్పగించింది.
READ MORE: IND vs NZ Final 2026: టీమిండియాకు కలిసిరాని ‘సండే’ ఫైనల్స్.. ఈసారి సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా?
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఇక టీ20 వరల్డ్ కప్ 2007లో మొదటి సారి ప్రారంభమైంది. అదే సమయంలో ఈ ట్రోఫీ రూపకల్పన సైతం పూర్తయింది. రూపరేఖలు ఖరారైన తర్వాత ట్రోఫీ తయారీ పనిని తనకు అప్పగించారని అమిత్ పాబువాల్ తెలిపారు. అలా ప్రపంచ క్రికెట్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ ట్రోఫీ జైపూర్‌లో రూపుదిద్దుకుంది. అయితే ఈ ట్రోఫీ తయారీ అంత సులభంగా జరగలేదు. మొదట ఈ ట్రోఫీని టైటానియం అనే లోహం, గాజు కలయికతో తయారు చేయాలని నిర్ణయించారు. ఈ మ్యాచ్‌లు త్వరగా ఫినిష్ అవుతాయి కాబట్టి.. 20 ఓవర్ల ఆట శైలిని ప్రతిబింబించేలా ఆధునిక రూపంలో ఉండాలని ఆలోచించారు. అందుకోసం అనేక నమూనాలు కూడా తయారు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు విజయవంతం కాలేదు. గాజును లోహంతో కలిపే సమయంలో అది పదే పదే విరిగిపోయింది. సాంకేతికంగా ఈ సేఫ్ రావడం కష్టంగా మారిందని అమిత్ పాబువాల్ గుర్తించారు. దాంతో చివరకు ట్రోఫీని వెండి లోహంతో తయారు చేసి, పైభాగానికి ప్లాటినం పూత వేయాలని నిర్ణయించారు. ఈ విధంగా తయారు చేసిన ట్రోఫీ బలంగా ఉండటంతో పాటు అంతర్జాతీయ స్థాయి పోటీకి తగిన గౌరవాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు. ఈ ట్రోఫీకి మరో ప్రత్యేకత సైతం ఉంది. అసలు ట్రోఫీ అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రధాన కార్యాలయంలోనే భద్రపరిచి ఉంచుతారు. పోటీలో గెలిచిన జట్టుకు అదే రూపంలో తయారు చేసిన మరో డమ్మీ ట్రోఫీని ఇస్తారు. ఈ ట్రోఫీ సుమారు ఇరవై ఒక అంగుళాల ఎత్తు ఉంటుంది. దాదాపు ఆరు కిలోల బరువు ఉంటుంది. వెండితో తయారు చేసి పైభాగానికి ప్లాటినం పూత వేయడం వల్ల ఇది మెరిసిపోతూ ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు అత్యంత గౌరవప్రదమైన గుర్తుగా నిలుస్తుంది.
READ MORE: IND vs NZ Final 2026: టీమిండియాకు కలిసిరాని ‘సండే’ ఫైనల్స్.. ఈసారి సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా?
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!