మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా పరిస్థితి డోలాయమాన స్థితిలో ఉంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే మంగళవారం నాటి బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తప్పక గెలవాలి. అంతేకాకుండా ఈనెల 27న జరిగే దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లోనూ విజయం సాధించాలి. అప్పుడే భారత్ ప్రపంచకప్‌లో సెమీస్ చేరేందుకు అవకాశం ఉంటుంది. టీమిండియా సమస్య ఏంటంటే.. బ్యాటర్లు రాణిస్తున్నప్పటికీ బౌలర్లు మాత్రం పూర్తి స్థాయిలో రాణించడం లేదు. కాబట్టి విజయాల బాట పట్టాలంటే బౌలర్లు తమ బంతులకు…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌పై అతడి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ స్పందించాడు. కోహ్లీ బాగానే రాణిస్తున్నాడు కానీ అతి జాగ్రత్తగా ఆడుతుండటం అతడి కొంప ముంచుతోందని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ మునుపటిలా ఆడాలంటే దూకుడుగా ఆడాలని సూచించాడు. కెరీర్లో ప్రారంభంలో స్వేచ్ఛగా ఆడినట్లే ఇప్పుడు కూడా ఆడితేనే తిరిగి ఉన్నత స్థానానికి చేరుకుంటాడని తెలిపాడు. దీని కోసం కోహ్లీ మళ్లీ తన అకాడమీకి రావాలని.. అతడు తన బేసిక్స్‌ను తిరిగి నేర్చుకోవాలని కోరాడు.…
ఎవరికైనా కొన్ని కలిసివచ్చే నెంబర్లు ఉంటాయి.. ఆ తేదీలో లేదా ఆ నెలలో.. ఏది చేసిన వాళ్లకు కలిసివచ్చే సందర్భాలుంటాయి.. దీంతో అవే తమ లక్కీ నెంబర్లుగా ఫాలో అయిపోతుంటారు.. ఇక, వికెట్ కీపర్‌గా టీమిండియాలో అడుగుపెట్టి.. జట్టును విజయాల బాట పట్టించిన జార్ఖండ్ డైనమెట్ ఎంఎస్ ధోనీ పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చేది జెర్సీ నెంబర్ 7.. ధోనీ వికెట్ల వెనుక చురుకుగా కదిలే విధానం.. బ్యాటింగ్, కెప్టెన్సీ.. ఇలా అన్నీ ఆ నెంబర్‌కు…
టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషిన్‌గా పేరుపొందిన విరాట్ కోహ్లీ ఇప్పుడు క్రికెట్ ప్రేమికులను నిరాశపరుస్తున్నాడు.. శ్రీలంకతో రెండో టెస్టులో విరాట్ కోహ్లి అవుటైన తీరు ఇది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఎలా అవుటయ్యాడో.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సేమ్ టు సేమ్. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్‌లో అవుటైతే.. రెండో ఇన్నింగ్స్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్‌కు తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. విరాట్ కోహ్లి ఇప్పటివరకు 101 టెస్టులు ఆడాడు. వందో టెస్టులో 45 పరుగులు చేసిన విరాట్.. ఇక…
సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్వీన్ స్వీప్ చేసింది. ఈ రెండు టెస్టులు మూడు రోజుల్లోనే ముగిసిపోయాయి. ఈ సిరీస్ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్ తన స్థానాన్ని మెరుగుపరచుకుంది. 58 శాతం విజయాలతో ఐదు నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. డబ్ల్యూటీసీలో భాగంగా ఇప్పటివరకు నాలుగు సిరీస్‌లు ఆడిన టీమిండియా ఆరు విజయాలు సాధించింది. మూడు మ్యాచ్‌లలో ఓడిపోయింది. రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. మొత్తంగా…
సొంతగడ్డపై టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. గత పదేళ్లుగా టీమిండియా సొంతగడ్డపై ఏ జట్టు కూడా భారత్‌ను ఓడించలేకపోయింది. ఈ నేపథ్యంలో స్వదేశంలో వరుసగా 15 సిరీస్‌లను గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. భారత్ తర్వాత స్వదేశంలో అత్యధిక టెస్ట్ సిరీస్‌లను గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆసీస్ స్వదేశంలో వరుసగా 10 టెస్ట్ సిరీస్‌లను తమ ఖాతాలో వేసుకుంది. 1994 నవంబర్ నుంచి 2000 నవంబర్ మధ్యలో ఒకసారి, 2004 జూలై నుంచి…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ లేమితో సతమతం అవుతున్నాడు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ముందు కనీసం హాఫ్ సెంచరీలైనా చేస్తున్నాడని అభిమానులు మురిసిపోయారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కోహ్లీ దారుణంగా విఫలమవుతున్నాడు. సెంచరీ సంగతి పక్కన బెడితే… కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. టెస్టు కెరీర్లో కోహ్లీ సగటు ఏకంగా 50కి దిగువకు పడిపోయింది. దీంతో ఇన్నాళ్లు 3 ఫార్మాట్లలో 50కి పైగా సగటుతో ఉన్న కోహ్లీ ప్రస్తుతం ఆ…
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకువెళ్తోంది. రెండో రోజు ఆటలో మరో 10 ఓవర్ల ఆట మిగిలి ఉండగా రెండో ఇన్నింగ్స్‌ను 303/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. రిషబ్ పంత్ (50), శ్రేయస్ అయ్యర్ (67) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. రోహిత్ (46), విహారి (35), జడేజా (22), మయాంక్ (22) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో జయవిక్రమ 4 వికెట్లు, ఎంబుల్దెనియా 3 వికెట్లు పడగొట్టారు. తొలి…
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న డే/నైట్ టెస్టులో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పటికే 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లోనూ మెరుగైన స్కోర్ దిశగా సాగుతోంది. అయితే ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిన సిక్సర్ కారణంగా స్టేడియంలోని ఓ అభిమాని గాయపడ్డాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్ 6వ ఓవర్లో శ్రీలంక బౌలర్ విశ్వ ఫెర్నాండో వేసిన షార్ట్ పిచ్ బాల్‌కు రోహిత్ మిడ్ వికెట్ మీదుగా…
టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించింది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం బెలిండా క్లార్క్ రికార్డ్ బ్రేక్ చేసింది. ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించి మిథాలీ రాజ్ రికార్డు క్రియేట్ చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ బెలిండా ఇప్పటివరకు 23 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించింది. అయితే న్యూజిలాండ్ వేదికగా సెడన్ పార్క్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో 24 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన మిథాలీరాజ్…