Dhurandhar 2 Telugu Trailer: ‘ఇక పాకిస్థాన్ భవిష్యత్తు హిందూస్థాన్ నిర్ణయిస్తుంది’.. ‘ధురంధర్ 2’ తెలుగు ట్రైలర్ చూశారా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar 2 Telugu Trailer: బాలీవుడ్ బాక్సాఫీస్ ఆకలిని తీర్చడంతో పాటు, ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన చిత్రం ‘ధురంధర్’. గత ఏడాది రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1,350 కోట్లు కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది. దేశభక్తి అంశాలతో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతోగానో మెప్పించింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ సీక్వెల్ ‘ధురంధర్ 2’ భారీ అంచనాల మధ్య ఈ నెల 19న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ క్రమంలో హిందీ ట్రైలర్‌ను శనివారం రిలీజ్ చేసిన మేకర్స్, ఆదివారం తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు.
READ ALSO: IND vs NZ Final 2026: టీమిండియాకు కలిసిరాని ‘సండే’ ఫైనల్స్.. ఈసారి సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా?
Also Read
ట్రైలర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మామూలుగా లేదు. ఒక్కొక్క డైలాన్, హీరో రణ్‌వీర్ సింగ్ ప్రజెన్స్, యాక్షన్ ట్రైలర్‌లో హైలెట్‌గా నిలిచాయి. దేన్నైనా ఓర్చుకునే వాడే మగాడు.. అంటూ సంజయ్‌దత్ పలికిన డైలాగ్, ఇక పాకిస్థాన్ భవిష్యత్తు హిందూస్థాన్ నిర్ణయిస్తుందని రణ్‌వీర్ సింగ్ చెప్పడం లాంటివి ఈ సినిమా ఫ్యాన్స్‌కు మస్త్ మజా ఇస్తాయి. సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్, ట్రైలర్‌తోనే అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. ఈ ట్రైలర్‌లో రణ్‌వీర్ సింగ్ ఊరమాస్ లుక్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ అభిమానులను అలరిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్‌లో ఉన్న ఎమోషన్‌కు మించి, ఈసారి రివెంజ్ డ్రామాను మరింత పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఆదిత్య ధర్ టేకింగ్, విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండటం విశేషం. జియో స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మార్చి 18న సాయంత్రం 5 గంటల నుంచే దేశవ్యాప్తంగా పెయిడ్ ప్రివ్యూస్ స్టార్ట్ అవుతాయి. ట్రైలర్ ఇంప్యాక్ట్ చూస్తుంటే, మొదటి రోజే అన్ని రికార్డులు బద్దలయ్యేలా ఉన్నాయి. ఫస్ట్ పార్ట్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం సిక్వె్ల్‌తో మరెన్ని రికార్డ్‌లను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
READ ALSO: NTR: కర్ణాటకలో ఎన్టీఆర్ మానియా.. ఫ్యాన్స్ రచ్చ.. గ్యాంగ్‌స్టర్ లుక్ అరాచకం!
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!