Shubman Gill: విదేశీ గడ్డపై ఈ రికార్డు సాధించిన ఏకైక భారతీయ క్రికెటర్ అతడే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill: జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మూడో వన్డేలో సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను కూడా కైవసం చేసుకున్నాడు. అంతేకాకుండా 22 ఏళ్ల వయసులోనే విదేశీ గడ్డపై బ్యాక్ టు బ్యాక్ వన్డే సిరీస్‌లలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన టీమిండియా ఏకైక క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో కూడా గిల్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో గిల్ మొత్తం 245 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. గిల్ ప్రతిభావంతుడైన క్రికెటర్ అని టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పాటు పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసిస్తున్నారు.
Read Also: Team India: టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కరోనా.. ఆసియా కప్‌కు దూరం?
Also Read
- Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
- Punam Raut Retires: "చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా".. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
- IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027 ముందే స్టార్ ప్లేయర్ అవుట్.. ఇక కష్టమే!
- Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
అటు ఈ సిరీస్‌లో తన బ్యాటింగ్ గురించి గిల్ మాట్లాడుతూ.. తాను డాట్ బాల్స్ పర్సంటేజీని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నానని.. వీలైనంత వరకు గ్యాప్‌లలో బంతిని తరలించేందుకు చూశానని తెలిపాడు. నిలదొక్కుకుంటే ఎటాకింగ్ గేమ్ ఎలా ఆడాలో తనకు తెలుసు అని.. అందుకే హాఫ్ సెంచరీ పూర్తయ్యాక జింబాబ్వే బౌలర్లపై అటాకింగ్‌కు దిగినట్లు వెల్లడించాడు. కాగా తన తొలి సెంచరీని తన తండ్రికి అంకితమిస్తున్నట్లు గిల్ పేర్కొన్నాడు. ‘మా నాన్న నా ప్రైమరీ కోచ్. నేను రెండో వన్డేలో ఔట్ అయ్యాక మా నాన్న నాతో చాలా సేపు మాట్లాడాడు. బేటా నువ్వు చేసిన మిస్టేక్స్ ఇవి.. సరిదిద్దుకో అంటూ చెప్పారు. అది నాకు ఉపయోగపడింది. కాబట్టి ఈ సెంచరీని మా నాన్నకే అంకితం చేస్తున్నాను’ అని గిల్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్‌డే పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
-
India Rice Exports: కేవలం 5 నెలల్లో బియ్యం ఎగుమతులతో రూ.45,739 కోట్లు.. భారత్‌కు భారీ ఆదాయం!
-
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
ట్రెండింగ్
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..