ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో కరోనా కలకలం రేగింది. కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు. శనివారం నిర్వహించిన యాంటిజెన్ పరీక్షల్లో రోహిత్‌కు వైరస్ నిర్ధారణ అయినట్లు బీసీసీఐ ఆదివారం ట్వీట్ చేసింది. దీంతో జూలై 1 నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు రోహిత్ దూరం కానున్నాడు. అటు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో జట్టు పగ్గాలు బుమ్రాకు ఇస్తారని ప్రచారం…
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లోని అగ్రశ్రేణి జట్లలో టీమిండియా ఒకటి. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు. అటు వన్డే, ఇటు టీ20లలో టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గానూ నిలిచింది. టెస్టుల్లోనూ అగ్రస్థానంలో కొన్నాళ్ల పాటు కొనసాగింది. అయితే 1983లో టీమిండియా పసికూన . ఆ ఏడాది జరిగి వన్డే ప్రపంచకప్‌లో అండర్ డాగ్‌గా బరిలోకి దిగింది. ఆనాడు టీమిండియాపై ఎలాంటి అంచనాలు లేవు. సెమీస్‌కు వెళ్తే అదే గొప్ప అనే అభిప్రాయంలో క్రికెట్ పండితులు ఉన్నారు. కానీ కపిల్ దేవ్…
ఇంగ్లండ్‌తో కీలక టెస్టుకు ముందు లీసెస్టర్ షైర్తో ఆడుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా తడబడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 246/8 వద్ద డిక్లేర్ చేసింది. రోహిత్, కోహ్లీ, అయ్యర్, గిల్ వంటి ప్రతిభావంతులు భారీ స్కోర్లు చేయలేనిచోట తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ ఒక్కడే టీమిండియా పరువు కాపాడాడు. అతడు 70 పరుగులతో రాణించడంతో భారత్ 200 పరుగులకు పైగా స్కోర్ చేయగలిగింది. కోహ్లీ (33), రోహిత్ (25),…
జూలై 1 నుంచి టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య కీలకమైన ఐదో టెస్ట్ జరగనుంది. గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడ్డ టెస్టును ఈ ఏడాది నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఊరట కలిగింది. కరోనా బారిన పడ్డ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా కోలుకున్నాడు. గురువారం లీసెస్టర్ షైర్తో ప్రాక్టీస్ మ్యాచ్ ప్రారంభానికి ముందు జట్టుతో పాటు ప్రాక్టీస్ సెషన్లో కూడా పాల్గొన్నాడు. ఈ మేరకు ప్రాక్టీస్ సెషన్లో అశ్విన్ పాల్గొన్న…
టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చి నేటితో 15 ఏళ్లు పూర్తవుతోంది. 2007, జూన్ 23న బెల్ఫాస్ట్లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తరఫున రోహిత్ తన తొలి మ్యాచ్ ఆడాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రోహిత్ శర్మ సోషల్ మీడియా ద్వారా ఓ లెటర్‌ను అభిమానులతో పంచుకున్నాడు. తనకు ఇష్టమైన జెర్సీలో ఈ జర్నీని పూర్తి చేసుకున్నట్లు రోహిత్ తెలిపాడు. ఇది ఎంతో గొప్ప…
ఇప్పటివరకు రుమేలీ ధర్ ఇండియా తరఫున 78 వన్డేలు ఆడి 961 పరుగులు చేసింది. అటు 18 టీ20లు ఆడి 131 పరుగులు సాధించింది. టెస్ట్ కెరీర్లో నాలుగు టెస్టులు మాత్రమే ఆడింది. నాలుగు టెస్టుల్లో రుమేలీ ధర్ 236 పరుగులు చేసింది.
ఇటీవల దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి మాల్దీవులకు వెళ్లాడు. అక్కడ కోహ్లీ తన కుటుంబంతో బాగా ఎంజాయ్ చేశాడు. వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కోహ్లీ కరోనా పాజిటివ్ బారిన పడినట్లు ఓ జాతీయ పత్రిక తన కథనంలో పేర్కొంది.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఉమ్రాన్ మాలిక్ 22 వికెట్లు తీయడంతో పాటు నిలకడగా 150 కి.మీల వేగంతో బంతులు వేయడంతో.. రానున్న టీ20 వరల్డ్‌కప్‌లో అతడ్ని టీమిండియాలోకి తీసుకోవాలన్న అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతో పాటు మాజీలు సైతం అతడ్ని తుది జట్టులో ఎంపిక చేయాల్సిందేనని సిఫార్సు చేస్తున్నారు. అయితే.. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించడం హాట్ టాపిక్‌గా మారింది. ఓ క్రీడా ఛానల్ చర్చలో భాగంగా ఉమ్రాన్ గురించి మాట్లాడుతూ..…
ఈరోజు రాజ్‌కోట్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగో టీ20 జరగనుంది. విశాఖలో జరిగిన గత మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకున్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలవాల్సి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికా గెలిస్తే ఐదు టీ20ల సిరీస్ ఆ జట్టు సొంతం అవుతుంది. ఎందుకంటే ఆ జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. అయితే ఈ సిరీస్‌లో టీమిండియాను కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ కలవరపెడుతోంది. వరుసగా మూడు మ్యాచ్‌లలో 29,…
గత ఏడాది కరోనా కేసుల కారణంగా ఇంగ్లండ్‌లో టీమిండియా ఆడుతున్న టెస్టు సిరీస్ అర్ధంతరంగా ఆగిపోయింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాలుగు టెస్టులు మాత్రమే జరిగాయి. ఐదో టెస్టు వాయిదా పడింది. ఈ టెస్టును ఈ ఏడాది నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాయిదా పడిన ఐదో టెస్టు ఆడేందుకు టీమిండియా గురువారం నాడు ఇంగ్లండ్ బయలుదేరి వెళ్లింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఈ నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్ జూలై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది. అయితే…