Ind Vs Zim: నేడు రెండో వన్డే.. రిస్క్ చేసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌కు వస్తాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind Vs Zim: జింబాబ్వే గడ్డపై ఆ దేశ జట్టుతో టీమిండియా నేడు రెండో వన్డే ఆడనుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది. రెండో వన్డేలోనూ టీమిండియా ఫేవరేట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమైన నేపథ్యంలో ఈ వన్డేలో అతడు ఓపెనింగ్‌కు వస్తాడా లేదా మిడిలార్డర్‌లోనే వస్తాడా అన్న విషయం ఉత్కంఠ రేపుతోంది. ఆసియాకప్‌కు ముందు అతడు ఫామ్‌లోకి రావాలని జట్టు కోరుకుంటోంది. అటు ఆడుతోంది పసికూన జింబాబ్వేతో అయినా టీమిండియా రక్షణాత్మక ధోరణి అవలంభిస్తుండటం అభిమానులకు నచ్చడం లేదు. తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోకుండా కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకోవడమేంటని పలువురు నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు.
Read Also: Boycott Amazon: శ్రీకృష్ణుడిని అవమానించిన అమెజాన్.. బాయ్‌కాట్ చేయాలంటూ డిమాండ్
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
ఇటీవల బంగ్లాదేశ్‌తో ప్రదర్శన చూశాక జింబాబ్వే టీమిండియాకు కనీస పోటీ ఇస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావించారు. కానీ తొలి వన్డేలో 110 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి 150 పరుగులైనా జింబాబ్వే చేస్తుందా అని చాలా మంది సందేహించారు. అయితే టెయిలెండర్ల ప్రతిభ కారణంగా 190 పరుగుల టార్గెట్‌ను జింబాబ్వే నిర్దేశించింది. ఈ టార్గెట్‌ను భారత్ వికెట్ కోల్పోకుండా ఛేదించినా మరీ నెమ్మదిగా ఆడారంటూ ధావన్-గిల్ విమర్శలను ఎదుర్కొన్నారు. జింబాబ్వే లాంటి జట్టుపైనా రిస్క్ చేసి ఆడకపోతే టీమిండియా ఎందుకంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు. ఈ మధ్య టీమ్ అప్రోచ్ మారిందని, దూకుడే మంత్రంగా జట్టు ముందుకు సాగుతుందని టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ పదే పదే చెప్పారు. కానీ జింబాబ్వేతో తొలి వన్డేలో అలాంటి సీన్ కనిపించలేదు. అటు ఏ మాత్రం పసలేకుండా సాగిన తొలి వన్డే మ్యాచ్ అభిమానులకు తీవ్ర బోర్ కొట్టించింది. కాగా ఇవాళ్టి మ్యాచ్ మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రారంభం అవుతుంది. తొలి వన్డేలో దిగిన జట్టుతోనే భారత్ బరిలోకి దిగనుంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..