ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి... కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓవర్ స్పీడ్ పాలిటిక్స్ చేసినట్టు చెప్పుకుంటారు. ఆయన నోటికి కూడా హద్దూ అదుపూ ఉండేది కాదన్నది రాజకీయవర్గాల్లో విస్తృతాభిప్రాయం. అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా తగ్గేదే లేదన్నట్టు చెలరేగిపోయేవారు. అబ్బే.... వాళ్ళకంత సీన్ లేదు, ఇంత సినిమా లేదంటూ మీసాలు మెలేసి సవాళ్ళు విసిరేవారాయన. కట్ చేస్తే.... రాష్ట్రంలో ప్రభుత్వం మారాక పూర్తిగా సైలెంట్ అయిపోయారు మాజీ ఎమ్మెల్యే.
అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి.. కొడతానంటే.. కొట్టమనండి.. కానీ, మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి.. అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి..
భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.. మాకు తెలియకుండా ఎవరైనా పదవులు తెచ్చుకుంటే వారిని నియోజకవర్గంలో కూడా అడుగుపెట్టనివ్వం అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. పదవులు ఇవ్వాలనుకుంటే మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి మాత్రమే ఇవ్వండి అని సూచించారు.. లేకపోతే అసలు పని చేయని వాళ్లకి పదవులు ఇస్తే అది కరెక్ట్ కాదు అని హితవుచెప్పారు..
అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో జరిగిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. అనకాపల్లి జిల్లా యంత్రాంగంపై విరుచుకుపడ్డా ఆయన.. అనకాపల్లి జిల్లా అవినీతి యంత్రాంగాన్ని ఉరి తీసినా తప్పులేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..
విశాఖ: నేటి నుంచి స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె. రెగ్యులర్ కార్మికులు ఒక రోజు విధుల బహిష్కరణ. స్టీల్ ప్లాంట్ లోపల బంద్, ర్యాలీలు, సభలపై నిషేదం. అమరావతి: నేడు తాడేపల్లిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ. రామచంద్రాపురం, పార్వతీపురం మున్సిపాలిటీలతో పాటు రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పోరేటర్లతో భేటీకానున్న వైఎస్ జగన్. తాజా రాజకీయ పరిణామాలు, పల అంశాలపై దిశానిర్దేశం చేయనున్న జగన్. అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 నెలల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీఠ వేశారు అని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. రానున్న నాలుగేళ్లలో నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పిస్తామన్నారు. దేశంలోని కోటి సభ్యత్వం కలిగిన ప్రధాన పార్టీ తెలుగుదేశం అని ఎమ్మెల్యే కాకర్ల కొనియాడారు. వింజమూరు ఎస్వి కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే కాకర్ల టీడీపీ మహానాడు నిర్వహించారు. మహానాడులో టీడీపీ జెండా ఆవిష్కరించి, స్వర్గీయ నందమూరి తారకరామారావు నివాళులర్పించారు.…
GVMC డిప్యూటీ మేయర్ పదవిని పోరాడి సాధించింది జనసేన పార్టీ.. గంగవరం కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి పేరును డిప్యూటీ మేయర్‌గా ఖరారు చేసింది జనసేన అధిష్టానం.. అయితే, జనసేన డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకున్నా.. ఇప్పుడు కూటమిలో కొత్త వివాదం మొదలైంది..
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో జరిగిన వేరు వేరు ఘటనల్లో దాదాపు ఏడుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కనివిని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించాం అన్నారు. మహానాడు నిర్వహణపై కమిటీలు వేశాం.. మహానాడు నిర్వహణలో 13 కమిటీలు కీలకంగా వ్యవహరించబోతున్నాయి.. ఆ 13 కమిటీల సలహాలు, సూచనలను క్రోడీకరించి ఒక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
TDP Mahanadu: కడప నగరంలోని పబ్బాపురం దగ్గర నిర్వహించనున్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ) మహానాడు ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మహానాడు నిర్వహణ కమిటీలతో మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమైంది.