Off The Record: నాడు చంద్రబాబు, పవన్‌కు సీన్ లేదంటూ సవాళ్లు.. ఇప్పుడు ఆ మాజీ ఎమ్మెల్యే భయపడ్డారా..?
- నాడు చంద్రబాబు, పవన్‌కు సీన్ లేదంటూ సవాళ్ళు..
- ప్రభుత్వం మారాక సైలెంట్ మోడ్‌లో ద్వారంపూడి..
- ఏడాది గడిచినా ఎందుకు మాట్లాడ్డం లేదని చర్చ..
- గతంలో ఊ..అంటే నోరేసుకుని పడిపోయే వైఖరి..
- ఇప్పుడు ఎందుకొచ్చిన గొడవ అని కామ్ అయ్యారా?..
- కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే రొయ్యల కంపెనీలు సీజ్..
- అడిగితే... టైం ఇవ్వాలి కదా అంటూ సన్నాయి నొక్కులు..
- కనిపిస్తున్న చిత్రాలతో స్పీడ్‌కు బ్రేక్ వేశారా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి… కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓవర్ స్పీడ్ పాలిటిక్స్ చేసినట్టు చెప్పుకుంటారు. ఆయన నోటికి కూడా హద్దూ అదుపూ ఉండేది కాదన్నది రాజకీయవర్గాల్లో విస్తృతాభిప్రాయం. అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా తగ్గేదే లేదన్నట్టు చెలరేగిపోయేవారు. అబ్బే…. వాళ్ళకంత సీన్ లేదు, ఇంత సినిమా లేదంటూ మీసాలు మెలేసి సవాళ్ళు విసిరేవారాయన. కట్ చేస్తే…. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక పూర్తిగా సైలెంట్ అయిపోయారు మాజీ ఎమ్మెల్యే. మొదట్లో… ఎవరైనా అడిగితే కొత్త ప్రభుత్వానికి టైం ఇవ్వాలి కదా అంటూ రాగాలు తీశారట. కానీ… కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది. మరి ఈయన ఇంకానోరు తెరవడం లేదేంటన్నది కాకినాడ పొలిటికల్ సర్కిల్స్‌లో నలుగుతున్న ప్రశ్న. గతంలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ని ఎవరైనా పల్లెత్తు మాట అంటే…వెంటనే అటాక్ చేసేవారు ద్వారంపూడి. కానీ ఇప్పుడు మాత్రం ఆ నోరు ఏమైపోయిందో అర్ధం కావడం లేదన్నది లోకల్ టాక్. అదే సమయంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో సార్… సైలెంట్ అయిపోయి ఉండవచ్చన్నది కొందరి అభిప్రాయం అట. గత ప్రభుత్వంలో హడావిడి చేసిన వైసీపీ నేతలు టార్గెట్ గా కూటమి ప్రభుత్వం పాత లెక్కలు సరిచేస్తోంది.
Read Also: Maruti Suzuki Fronx: ఆటోమేటిక్ వేరియంట్ కారు కోసం చూస్తున్నారా?.. రూ. 2 లక్షలు ఉంటే చాలు!
Also Read
కొందరు ఇప్పటికే జైళ్ళలో ఉంటే… మరి కొందరి వ్యవహారాల మీద దర్యాప్తులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే ఎందుకొచ్చిన గొడవ అనుకుని కామ్‌గా ఉన్నారా అన్న చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ద్వారంపూడికి చిన్న ఝలక్ ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న రొయ్యల కంపెనీలు కాలుష్య నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయంటూ సీజ్ చేశారు. దాంతో తత్వం బోధపడిందో ఏమోగానీ రెడ్డి గారు మాత్రం చిన్న సౌండ్ కూడా చేయడం లేదంటూ మాట్లాడుకుంటున్నారు స్థానికంగా. కూటమి ప్రభుత్వ వ్యవహారాలను ఎవరైనా ఆయన దృష్టికి తీసుకుని వెళ్లినా… వాళ్లకి టైం ఇవ్వాలి కదా అంటూ సున్నితంగా చెప్పి పంపేస్తున్నారట. టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తానని, అంతవరకు ఆగాలని మాట దాటవేస్తున్నట్టు సమాచారం. దమ్ముంటే పవన్ కళ్యాణ్ తనపై పోటీ చేసి గెలవాలని గతంలో సవాల్ చేశారు ద్వారంపూడి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ స్థాయిలో హైప్ క్రియేట్ చేసుకున్నారాయన. కానీ ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్న చిత్రాలతో మరీ అంత స్పీడ్ అయిపోవడం అవసరమా అని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. లేనిపోని వ్యవహారాలను నెత్తినేసుకుంటే కోర్టులు కేసులు జైలు అంటూ తిరగాలని కొత్త వేదాంతం చెప్తున్నారట అనుచరులకు. కొద్దిరోజులు అలా సాఫ్ట్ గా బండి నడవనివ్వండి తర్వాత చూద్దామన్నట్టుగా ఉందట ద్వారంపూడి వ్యవహారం. ఫలానా విషయంలో మీరు స్పందించాలని ద్వారంపూడికి పార్టీ ఆఫీస్ నుంచి ఆదేశాలు వస్తున్నా తాను ఔట్ ఆఫ్ స్టేషన్ అంటూ తప్పించుకుంటున్నట్టు సమాచారం.
Read Also: YS Jagan: పేర్లు రాసిపెట్టుకోండి.. మన టైం వస్తుంది.. అన్యాయం చేసినవారికి సినిమా చూపిస్తాం..!
గతంలో మాట్లాడింది, జరిగింది వేరు. ఆ మాటలు, చేష్టలకు సంబంధించి ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు… దాన్ని తప్పించుకోలేంగానీ… ఇప్పుడు మళ్ళీ కొత్త సమస్యలు క్రియేట్ చేసుకోవడం ఎందుకన్నది ఆచన అభిప్రాయంగా చెబుతున్నారు సన్నిహితులు. టైం మనది కానప్పుడు ఓవర్ స్పీడ్ అయిపోతే… స్పీడ్ బ్రేకర్లు వేయడానికి వాళ్ళు సిద్ధంగానే ఉంటారంటూ… గుర్తు చేస్తున్నారట. మాజీ ఎమ్మెల్యే చెబుతున్న ఈ మాటలు విని అనుచరులే అవాక్కవుతున్నారట. ఈయన అసలు ఆయనేనా అంటూ… బుగ్గలు నొక్కుకోవడమేకాదు, ఇంతలోనే ఎంత మార్పు అంటూ గుసగుసలాడుకుంటున్నారట. రాజకీయాలలో ఏం జరుగుతుందో అంతా తనకు తెలుసని, కొద్ది రోజులు వాటి గురించి చర్చించకపోవడమే మంచిదని ద్వారంపూడి అంటున్నట్టు తెలిసింది. తేడా వస్తే మీరు బాగానే ఉంటారు, నేను మాత్రం మిమ్మల్ని ములాఖత్‌లలోనే కలుసుకోవాల్సి వస్తుందని అంటున్నారట.మన టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలంటూ ఇప్పుడు పూర్తిగా వ్యాపారం మీదే దృష్టి పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. మొత్తం మీదఒకప్పటి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే… మాజీ అయ్యాక మాత్రం పూర్తిగా మౌన వ్రతం పట్టేశారు. అనవసరంగా కార్నర్ అవడం ఎందుకు అనుకు అనుకుంటూ ఆయన నోరెత్తడం లేదని సన్నిహితులు చెబుున్నా… కాకినాడలో మాత్రం ఆయన భయపడ్డారని, అందుకే ఏం మాట్లాడటం లేదన్న చర్చ జరుగుతోంది. అదే మాట ఎవరన్నా ఆయన దగ్గర అంటే…నో కామెంట్ అన్నదే సమాధానం అట.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!