Roop Kumar Yadav: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. మాజీ మంత్రి అనిల్ ని పుష్ప మూవీలో మంగళం శ్రీను తో పోల్చి విమర్శలు గుప్పించారు.. కరోనా సమయంలో ఓ హాస్పిటల్ యాజమాన్యాన్ని బెదిరించి మాజీ మంత్రి అనిల్ లక్షల రూపాయలు దండుకున్నారు.. 7 లక్షల రూపాయలకి షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ అమ్ముకున్నాడు.. అలాంటి వ్యక్తి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (VPR) మీద విమర్శలు చెయ్యడం దారుణం అన్నారు.. ఇరిగేషన్ పనుల్లో కమిషన్స్ పేరుతో అనిల్ కోట్ల రూపాయలు దోచుకున్నారు.. బర్రెల సంత దగ్గర మాజీ మంత్రి అనిల్ కోటి రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్లు సంపాదించాడు.. అధికారం పోయిన తర్వాత చెన్నై కి వెళ్లి దాక్కున్నాడని.. దుబాయ్ లో పెట్టుబడులు పెడుతున్నాడని మండిపడ్డారు.
Read Also: Dilraju : టాలెంట్ ఉన్న వారి కోసం సిద్ధమైన “దిల్ రాజు డ్రీమ్స్”
కూల్ డ్రింక్ షాప్ దగ్గర టైమ్ పాస్ చేస్తున్న అనిల్ ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి కార్పొరేటర్ గా గెలిపిస్తే.. క్యాడర్ కి ద్రోహం చేశాడని దుయ్యబట్టారు రూప్‌కుమార్.. ఓ క్రికెట్ బుకీ 2014లో అనిల్ కి 5 లక్షలు పార్టీ ఫండ్ ఇచ్చిన మాట వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి అనిల్ చేసిన పాపాన్ని నేను మోస్తున్నాను.. అన్నారు.. ఇక, క్వార్జ్ రవాణాపై నెల్లూరు డిప్యూటీ రూప్ కుమార్ స్పందిస్తూ.. క్వార్జ్ కి సంబంధించిన పరిశ్రమ VPR పెడుతుంటే మాజీ మంత్రి కావాలనే విమర్శలు చేస్తున్నాడు అని దుయ్యబట్టారు.. VPRకి సంబందించిన కంపెనీ ఒక్కటే క్వార్జ్ ని రవాణా చెయ్యడం లేదు.. అనేక సంస్థలు రవాణా చేస్తున్నాయన్న ఆయన.. మాజీ మంత్రి అనిల్ కి.. వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురంలో ఉండే క్వార్జ్ కి ఏం సంబంధం..? అని నిలదీశారు.. గత ప్రభుత్వంలో ఇల్లీగల్ మైనింగ్ జరిగింది కాబట్టే.. ఫైన్స్ వేశారు.. ఈ ప్రభుత్వంలో యే మైన్ మీదా ఫైన్స్ వెయ్యలేదని తెలిపారు.. మరోవైపు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తే.. మనమే సీఎం అని చెప్పుకున్న వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు రూర్ కుమార్ యాదవ్..