విశాఖ వన్‌టౌన్‌లో కూటమి పార్టీల మధ్య రాజకీయం రసకందాయంలో పడుతోంది. సౌత్ సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్, టీడీపీ ఇంచార్జ్ సీతంరాజు సుధాకర్ మధ్య కోల్డ్ వార్ నెక్స్ట్ లెవెల్‌కు చేరిందని చెప్పుకుంటున్నారు. వంశీకృష్ణ ఎమ్మెల్యేతో పాటు జనసేన సిటీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. సీతంరాజు సుధాకర్ ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు ఎగ్జిక్యూటివ్ వైస్-ఛైర్మన్‌తోపాటు విశాఖ దక్షిణం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Off The Record: కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అడ్డా. 1989 నుంచి ఇక్కడ ఓటమి ఎరగని నేతగా ఉన్నారాయన. అయితే… 2019 ఎన్నికల తర్వాత కుప్పంలో టీడీపీ పని అయిపోయిందంటూ…పెద్ద ఎత్తున ప్రచారం చేసింది వైసీపీ. కానీ… ఇప్పుడు ఆ పార్టీనే అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. 2024 ఎన్నికలు జరిగిన పది నెలల్లోపే కుప్పంలో వైసీపీ ప్రాబల్యం తగ్గిపోయింది. నియోజకవర్గంలో దాదాపుగా పార్టీ జెండా పీకేసే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. తాము అధికారంలో…
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. కానీ... ఈ ఏడాదిలో గతంలో ఎన్నడూలేని పరిస్థితి కనిపిస్తోందని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు సెక్రటేరియెట్‌కు వచ్చే విజిటర్స్‌తో పాటు... సొంత పార్టీ కార్యకర్తలు, సిన్సియర్ అని పేరున్న కొందరు అధికారులు సైతం ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారట.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీగా గడుపుతున్నారు.. ఓవైపు సమీక్షలు, సమావేశాలు, ర్యాలీలు.. మధ్యలో జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు.. ఇక, సీఎం చంద్రబాబు రేపు (17వ తేదీ) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11.25కి కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా.. పాకిస్తాన్ అయిపోతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. సంపద సృష్టిస్తామని అన్నారు కదా.. ఇప్పుడు ఏమి అయ్యింది? అని ప్రశ్నించారు..
మన నేలపై ఉత్పత్తయ్యే విద్యుత్ రాష్ట్రానికే కాకుండా.. భారతదేశానికి మొత్తం సరఫరా చేస్తాం అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ సోలార్ ప్రాజెక్ట్ ద్వారా విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయన్నారు. రెన్యువబుల్ ఎనర్జీ పరిశ్రమ మాత్రమే కాదు ఉద్యమం అని పేర్కొన్నారు. భారత క్లీన్ ఎనర్జీ విప్లవానికి శంకుస్థాపన చేశాం అని, ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి అనుగుణంగా ప్జాజెక్ట్ రూపకల్పన చేశామని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. త్వరలోనే…
అనంతపురం జిల్లాలో రెండవ రోజు మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. గుత్తి మండలం బేతేపల్లి గ్రామంలో సోలార్ ప్లాంట్‌కు నేడు మంత్రి లోకేష్, రెన్యూ చైర్మన్ సుమంత్ సిన్హా శంకుస్థాపన చేయనున్నారు. ఇండియాలో అతి పెద్ద రెన్యువబుల్ పవర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దావోస్‌లో ఈ సంస్థ ఏర్పాటులో లోకేష్ కీలక పాత్ర పోషించారు. సుమారు 22 వేల కోట్లతో ప్రాజెక్ట్ రూపకల్పన చేశారు. తొలి దశలో 587 మెగా వాట్ల సోలార్, 250 మెగా…
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది. రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే కొందరు, ఆ తర్వాత మరి కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు ఆ పార్టీకి రాజీనామాలు చేశారు. కానీ.... ఇంతవరకు ఒక్క రాజీనామా కూడా మండలి ఛైర్మన్ ఆమోదం పొందలేదు. ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి బైబై చెప్పేశారు.
2024 ఎన్నికల్లో ఒకరకమైన ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నాయకులు. గెలుపు కోసం ఐదేళ్ళు ఎదురు చూసిన కొందరు పొత్తు ధర్మంలో భాగంగా అప్పటిదాకా తాము వర్కౌట్ చేసుకున్న సీట్లను జనసేనకు వదులుకోవాల్సి వచ్చింది. సర్దుకుపోవాల్సిందేనని పార్టీ పెద్దలు తెగేసి చెప్పడంతో టిడిపి సీనియర్లు సైతం నోరుమెదపలేకపోయారు అప్పట్లో. అంత వరకు ఓకే అనుకున్నా... ఆ తర్వాతే అసలు టెన్షన్ మొదలైందట. నాడు సీట్లు త్యాగాలు చేసిన వారికి తగిన గుర్తింపు…