ఇకపై కార్యకర్తల బాధ్యత తనదే అని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారి ఇంటికి పెద్దకొడుకులా అండగా ఉంటానని చెప్పారు. టీడీపీకి కార్యకర్తలే బలమని, ఇకపై కార్యకర్తలను నేరుగా కలుసుకోవాలని మంత్రి నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో హత్యకు గురైన రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటి రెడ్డి కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని వారితో లోకేష్ భేటీ అయ్యారు.
Also Read: CM Chandrababu: తిరుపతి గంగమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు!
వెన్నా బాలకోటి రెడ్డి నాలుగు దశాబ్దాలుగా పార్టీ పటిష్టత, ప్రజా సంక్షేమ కోసం పనిచేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి అండతో బాలకోటి రెడ్డిని కొందరు తుపాకీతో కాల్చి చంపారని ఫైర్ అయ్యారు. హత్యకు ఆరు నెలల ముందు కత్తులతో దాడికి యత్నించగా బాలకోటి రెడ్డి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని, రక్షణ కోసం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని మండిపడ్డారు. బాలకోటి రెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష తప్పదని మంత్రి లోకేష్ హెచ్చరించారు. బాలకోటి రెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.