IAS, IPS Officers Transfer: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ వారంలో బదిలీల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది.
Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను తుళ్లురు పోలీసులు అరెస్ట్ చేశారు. నందిగం సురేష్ తనపై దాడి చేశాడని టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సురేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.
నేను మాటల మంత్రిని కాదు.. పనులు చేసి చూపించే మంత్రిని అని పొంగూరు నారాయణ పేర్కొన్నారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనలో అభివృద్ధి కుంటపడింది అని మండిపడ్డారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా ఉంటోంది. రకరకాల గొడవలు, ఆరోపణలతో పొలిటికల్ హీట్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. గతంలో ఇక్కడ ముఠా కక్షలు, రాజకీయ ఘర్షణలు చాలా కామన్‌గా ఉండేవి. అదంతా వేరే సంగతి. కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన, పూర్తి నేలబారు వ్యవహారాలు నడుస్తున్నాయన్న టాక్ ఉంది నియోజకవర్గంలో. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులపై నిత్యం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బండారు సత్యానందరావు.. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట టీడీపీ ఎమ్మెల్యే. ఇన్నాళ్ళు సౌమ్యుడిగా పేరున్న బండారు తీరు ఈసారి మారిందన్న టాక్ బలంగా నడుస్తోంది నియోజకవర్గంలో. ఇప్పుడాయన ఏకంగా నాలుగు ముక్కలాట ఆడుతున్నారట. కూటమిలోని మూడు పార్టీల నాయకులను పక్కనపెట్టి... వైసీపీ వాళ్ళని అందలం ఎక్కిస్తున్నారన్నది ఇప్పుడు కొత్తపేటలో హాట్ సబ్జెక్ట్. అధికారంలోకి వచ్చిన నాటినుండి చాటుమాటుగా కొనసాగుతున్న చెలిమి ఇటీవల ఆయన పుట్టిన రోజు వేడుకల్లో బయటపడిందట.
విశాఖ వన్‌టౌన్‌లో కూటమి పార్టీల మధ్య రాజకీయం రసకందాయంలో పడుతోంది. సౌత్ సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్, టీడీపీ ఇంచార్జ్ సీతంరాజు సుధాకర్ మధ్య కోల్డ్ వార్ నెక్స్ట్ లెవెల్‌కు చేరిందని చెప్పుకుంటున్నారు. వంశీకృష్ణ ఎమ్మెల్యేతో పాటు జనసేన సిటీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. సీతంరాజు సుధాకర్ ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు ఎగ్జిక్యూటివ్ వైస్-ఛైర్మన్‌తోపాటు విశాఖ దక్షిణం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Off The Record: కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అడ్డా. 1989 నుంచి ఇక్కడ ఓటమి ఎరగని నేతగా ఉన్నారాయన. అయితే… 2019 ఎన్నికల తర్వాత కుప్పంలో టీడీపీ పని అయిపోయిందంటూ…పెద్ద ఎత్తున ప్రచారం చేసింది వైసీపీ. కానీ… ఇప్పుడు ఆ పార్టీనే అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. 2024 ఎన్నికలు జరిగిన పది నెలల్లోపే కుప్పంలో వైసీపీ ప్రాబల్యం తగ్గిపోయింది. నియోజకవర్గంలో దాదాపుగా పార్టీ జెండా పీకేసే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. తాము అధికారంలో…
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. కానీ... ఈ ఏడాదిలో గతంలో ఎన్నడూలేని పరిస్థితి కనిపిస్తోందని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు సెక్రటేరియెట్‌కు వచ్చే విజిటర్స్‌తో పాటు... సొంత పార్టీ కార్యకర్తలు, సిన్సియర్ అని పేరున్న కొందరు అధికారులు సైతం ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారట.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీగా గడుపుతున్నారు.. ఓవైపు సమీక్షలు, సమావేశాలు, ర్యాలీలు.. మధ్యలో జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు.. ఇక, సీఎం చంద్రబాబు రేపు (17వ తేదీ) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11.25కి కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు సీఎం చంద్రబాబు..