CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు యోగాంధ్ర తీర్మానం ప్రవేశ పెట్టారు. రెండు నిమిషాలు మౌనంగా మెడిటేషన్ చేసి తీర్మానాన్ని బలపరచమని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ యుగంలో ఉన్నాం.. వత్తిడితో ఉన్నాం.. గత ఐదేళ్లలో పార్టీ కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడ్డారు అని తెలిపారు. యోగాను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకుని, సాధన చేయాలి అని సూచించారు. 11వ అంతర్జాతీయ యోగాను ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు.. జూన్ 27వ తేదీన విశాఖపట్నంలో జరిగే యోగా డే చారిత్రక ఘటన.. ప్రతి ఒక్కరూ యోగను తమ జీవితంలో భాగం చేసుకోవాలి అన్నారు. ఇక, వేద కాలం నుంచి యోగా శాస్త్రం ఉంది.. పతంజలి మహర్షి మనకు అద్భుతమైన యోగాను ఇచ్చారు అని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also: Central Cabinet Decisions: కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్.. ఏవేవంటే..!
అయితే, సులువైన ఆసనాలతో యోగా ప్రాక్టీస్ చేసి మనం ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవచ్చు అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. 177 దేశాల్లో యోగాను పాట్టిస్తున్నారు.. ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రధాని మోడీ ఆమోదింపజేశారని తెలిపారు. యోగాతో సరికొత్త రికార్డు స్థాపించ బోతున్నాం.. ఇప్పటికే 28 లక్షల మంది రిజిస్టర్ చేయించుకున్నారు.. మాస్టర్ ట్రైనర్లను తయారు చేసాం..
మండల, గ్రామ స్థాయితో పాటు పర్యాటక ప్రదేశాలలో కూడా యోగాపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం అని చంద్రబాబు అన్నారు.