Minister Gottipati Ravi: విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులపై మహానాడులో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మొట్టమొదటి సారిగా విద్యుత్ సంస్కరణలు అమలు చేసింది సీఎం చంద్రబాబు అన్నారు. 1998లో విద్యుత్ రంగ సంస్కరణలను ప్రవేశ పెట్టిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ యే.. ఏపీను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన నేత కూడా చంద్రబాబేనని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేశాడని ఆరోపించారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు.. కానీ, వైసీపీ హాయాంలో తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి.
Read Also: CM Chandrababu: యోగాంధ్ర తీర్మానం ప్రవేశ పెట్టిన సీఎం చంద్రబాబు
అయితే, పారిశ్రామికవేత్తలను రాష్ట్రం నుంచి తరిమికొట్టిన చరిత్ర హీనుడు జగన్ మోహన్ రెడ్డి అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించాడు. తన అనుయాయులను దోచిపెట్టి విద్యుత్ రంగంపై రూ.1.29 లక్ష కోట్లు భారం మోపిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి.. 17 మంది సీఎంలు రూ. 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంగా మార్చితే.. అందులో 15 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఘనత చంద్రబాబుదే అన్నారు. ప్రధాన మంత్రి కార్యక్రమంలో పెట్టుబడిదారులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఆకట్టుకున్న ఒకే నాయకుడు చంద్రబాబు.. 72 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా మా ప్రభుత్వం పని చేస్తుంది.. రైతులకు పగటి పూటే నాణ్యమైన ఉచిత విద్యుత్ ను మా ప్రభుత్వం అందిస్తుందని చెప్పుకొచ్చారు. విద్యుత్ వినియోగదారుడిని, ఉత్పత్తిదారునిగా మా ప్రభుత్వం మార్చుతుందని గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు.
Read Also: Central Cabinet Decisions: కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్.. ఏవేవంటే..!
ఇక, రూ. 65 వేల కోట్లతో రిలయన్స్ 500 సీబీజీ ప్లాంట్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. ఈ సీబీజీ ప్లాంట్ల ద్వారా రాష్ట్రంలో 2.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాము.. రాష్ట్రంలో రూ.లక్ష కోట్ల పెట్టుబడితో NHPC, APGenco కలిసి సోలర్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి.. పూడిమడకలో 1,200 ఎకరాల్లో NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ హైడ్రోజన్ హాబ్ ను ఏర్పాటు చేస్తుంది అన్నారు. 2030 నాటికి ఏటా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.. గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా రాష్ట్రంలోని సుమారు 57 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని మంత్రి గొట్టిపాటి అన్నారు.