CM Chandrababu: మహానాడులో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొంత మంది ప్రత్యర్థులతో చేతులు కలిపి మన మధ్య కోవర్టులుగా ఉంటున్నారు అని ఆరోపించారు. వాళ్ళ ప్రోత్సాహంతో హత్యా రాజకీయాలు చేస్తున్నారు అని పేర్కొన్నారు. ఇప్పుడు నేను ఎవరినీ నమ్మడం లేదు.. ఇలాంటి తప్పుడు పనులు చేసే ఏ కార్యకర్తను కూడా వదిలి పెట్టనని హెచ్చరించారు. 1995 నుంచి నేను జాతీయ అధ్యక్షుడుగా ఉన్నాను.. నా బలం నా బలగం నా కార్యకర్తలు మా నాయకులే.. నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా కడప మహానాడు జరిగింది.. 43 ఏళ్లగా మహానాడు నిర్వహిస్తున్నాను.. ఎప్పుడూ లేని విధంగా ఈసారి మహానాడు అద్భుతంగా జరిగింది.. దీన్ని నా జీవితంలో మర్చిపోలేనని సీఎం చంద్రబాబు అన్నారు.
Read Also: YS Avinash Reddy: కూటమి నేతలు రోజులు లెక్క పెట్టుకోండి.. ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు..
ఇక, కడపలో ఇంత ఏర్పాట్లు మారుపెన్నడూ చూడలేదని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.. ప్రపంచంలో అగ్రస్థానంలో తెలుగుజాతి ఉంటుంది.. అది ఒక తెలుగుదేశానికి ఉందన్నారు. రేపు బహిరంగ సభ దిగ్విజయంగా జరుగుతుంది.. టీడీపీకి ఓ చరిత్ర ఉంది.. నక్సలిజాన్ని నాశనం చేశా.. ఫ్యాక్షనిజం, రౌడీయిజం లేకుండా చేశామన్నారు.. గత ఐదు సంవత్సరాల చూసాం ఆస్తులకు రక్షణ లేదు.. పోలీస్ శాఖను నిర్వీర్యం చేశారు.. లా అండ్ ఆర్డర్ అంటే తెలుగుదేశం పార్టీ.. తప్పు చేసిన వాడు ఈ రోజైనా రేపైనా శిక్షకు అర్హుడే.. చట్టాన్ని గౌరవించే వాళ్ళు నా కుటుంబ సభ్యులు.. తప్పు చేసిన వాడిపట్ల చండశాసనుడిగా ఉంటా.. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత నేను తీసుకున్నాను అని చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Siddaramaiah: కమల్‌హాసన్‌కు ఆ విషయం తెలియదు.. ముఖ్యమంత్రి అసహనం
అయితే, దేశంలో అత్యంతగా కరువు సీమగా బాధపడే జిల్లా అనంతపురం జిల్లా.. తెలుగు గంగా, హంద్రీనీవా, నగిరి ,గాలేరు కేసీ కెనాల్ శ్రీకారం చుట్టాను అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తా.. రాయలసీమ మైక్రో ఇరిగేషన్.. పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది.. 45 సంవత్సరాల నుంచి నన్ను ఆశీర్వదించారు అని చంద్రబాబు వెల్లడించారు.