Minister Nimmala: రాష్ట్ర ప్రజల దాహార్తి తీర్చడానికి నాడు ఎన్టీఆర్ నుంచి నేటి మన అధినేత చంద్రబాబు వరకు ఇరిగేషన్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మహానాడులో నీటి వనరులకు సంబంధించి ప్రతిపాదించిన తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచభూతాలలో ఒకటైన నీటి ఆవశ్యకతను, ప్రాధాన్యతను ఆనాడే మన పార్టీ అగ్రనేతలు గమనించారని అన్నారు. జల వనరులు ఉన్నచోటే నాగరికతలు వెల్లి విరుస్తాయనే చారిత్రక సత్యాన్ని మన పార్టీ ఆవిర్భావ దశలోనే గుర్తించింది.. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై మన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పని చేస్తుందని మంత్రి నిమ్మల పేర్కొ్న్నారు.
Read Also: UP: పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత.. భార్యను ప్రియుడికి అప్పజెప్పిన భర్త..!
అయితే, 2014 -19లో నాటి మన ప్రభుత్వం 72 శాతం పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయగా.. ఆ తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ ఆ ప్రాజెక్టుని విధ్వంసం చేసిందన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్రాన్ని కరువు రహితంగా చేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గోదావరిలో ఏటా వృథాగా పోతున్న నీటిని.. రాయలసీమకు తరలించి రతనాల సీమ చేయాలనేది మా టార్గెట్ అన్నారు. ఇందుకు 80 వేల కోట్లు అంచనా వ్యయంతో పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 72 లక్షల మందికి తాగునీరు, 7.2 లక్షలు ఎకరాలకు సాగునీరు, 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు. అప్పుడు, రాయలసీమ పచ్చని పైర్లతో అలా రారుతుందన్నారు. అలాగే, పోలవరం ఎడమ కాలువ పూర్తి చేయడం వల్ల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తవుతుంది.. విశాఖ నగరానికి తాగునీరు, విశాఖ ఉక్కు తదితర అనేక పారిశ్రామిక అవసరాలకు పూర్తిస్థాయి నీటిని అందించగలుగుతామని నిమ్మల రామానాయుడు చెప్పుకొచ్చారు.