Yuva Galam Padayatra Book: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినే, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై గళమెత్తుతూ తాను చేపట్టిన యువగళం పాదయాత్ర విశేషాలతో రూపొందించిన పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి అందజేశారు మంత్రి నారా లోకేష్. 2023 జనవరి 27వ తేదీన కుప్పంలోని శ్రీ వరద రాజస్వామి పాదాలచెంత నుంచి ప్రారంభించి 226 రోజుల పాటు లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఏపీ రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ చేపట్టిన పాదయాత్ర రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజక వర్గాలు, 232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,097 గ్రామాలను స్పృశిస్తూ సుమారు 226 రోజుల పాటు 3,132 కిలో మీటర్ల మేర జైత్రయాత్రలా కొనసాగింది.
Read Also: MCMVs: రక్షణ మంత్రిత్వ కీలక నిర్ణయం.. రూ.44వేల కోట్లతో యుద్ధ 12 నౌకల తయారీ..!
ఇక, యువగళం పాదయాత్రలో తనకు ఎదురైన అనుభవాలు, యాత్రను అడ్డగించేందుకు నాటి వైసీపీ ప్రభుత్వం అడగడుగునా సృష్టించిన అడ్డంకులు, ఆనాటి అరాచక పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, కన్నీటి గాధలను ఈ పుస్తకంలో సచిత్రంగా కళ్లకు కట్టినట్లుగా చూపారు నారా లోకేష్. ఇక, ఈ పుస్తకాన్ని ఆసక్తిగా తిలకించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత నారా లోకేష్ ను అభినందిస్తూ.. యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజల్లో చైతన్యం నింపారని, ఆనాటి అనుభవాలను పుస్తకరూపంలో తేవడం బాగుందంటూ ప్రశంసించారు.