ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెడుతూ ముందుకు వెళ్తున్నాం అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇస్తామని తెలిపారు.ఆగస్ట్ 15న ఉచిత బస్ పథకం మహిళలకు అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు అందరూ మనసుపెట్టి పనిచేయాలని, పొలిటికల్ గవర్నెన్స్‌తోనే అభివృద్ధి సాధ్యం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్వచ్చాంద్ర అమలు చేస్తున్నాం అని సీఎం తెలిపారు. 175 నియోజక వర్గాల యాక్షన్ ప్లాన్ కార్యాలయాల ప్రారంభోత్సవంలో సీఎం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, త్వరలో నిర్మించ తలపెట్టిన అన్ని రాష్ట్ర, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, అటవీ, వన్యప్రాణి క్లియరెన్స్ సమస్యలు జూలై నెలాఖరుకు పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం వేగవంతంగా జరిగేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో శరవేగంగా రహదారుల నిర్మాణం పూర్తి కావాలని, జూలై నెలాఖరుకు ఉన్న ఆటంకాలు తొలిగించాలని సీఎం అధికారులకు చెప్పారు. జాతీయ రహదారులు,…
Anagani Satyaprasad : అమరావతి మహిళలను కించపరచడంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సీరియస్ అయ్యారు. అమరావతి మహిళలను అత్యంత దారుణంగా కించపరచడం నీచాతినీచం అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ కు, ఆయన పేటీఎం బ్యాచ్ కు ఇంత కన్నా మంచి మాటలే రావా. ఇంతలా విషం కక్కుతారా. చివరకు మహిళలను కించపరచడం వైసీపీ చిల్లర బుద్ధికి నిదర్శనం. సీఎం చంద్రబాబు చెప్పినట్టు అమరావతి నిజంగానే దేవతల రాజధాని. రాజధానిని నిర్మించడానికి మేం…
Sri Bharath : స్టీల్ ప్లాంట్ లో కార్మికులను తొలగిస్తున్నారంటూ వస్తున్న రూమర్లపై తాజాగా ఎంపీ శ్రీ భరత్ స్పందించారు. స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్టు కార్మికులను తొలగించిన మాట వాస్తవమే అన్నారు. కంపెనీ మేనేజ్ మెంట్ అవసరం అయిన వారిని ఉంచి మిగతా కాంట్రాక్టు కార్మికులను తొలగించారని చెప్పారు భరత్. కంపెనీని తిరిగి లాభాల్లోకి తేవడానికే ఇలాంటి చర్యలు చేపడుతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. బ్లాస్ట్ ఫర్నిస్ త్రీ ప్రారంభించినప్పుడు అవసరమైతే కార్మికులను తిరిగి తీసుకుంటామని చెప్పుకొచ్చారు.…
టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారిపోయింది.. ఇతర పార్టీ నాయకులు టీడీపీలోకి జాయిన్ చేసుకునే ముందు తప్పనిసరిగా వారి గురించి కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి.. సీఎం చంద్రబాబు ఆదేశానుసారం ఇతర పార్టీల నాయకులను జాయిన్ చేసుకోవాలి.. వాళ్లపై విచారణ తర్వాత పార్టీ అనుమతితో పార్టీలోకి ఆహ్వానించాలని టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది..
ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవితకు కోపం వచ్చింది.. ఎంతలా అంటే.. ఓ అధికారి ఇచ్చిన బొకేను విసిరికొట్టేశారు మంత్రి.. శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. ఆలస్యంగా వెలుగు చూడగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. మంత్రిగారికి ఎందుకంత కోపం..? ఏమిటా ప్రెస్టేషన్..? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు..
ఎవరైనా వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు.. అంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పార్టీ ముఖ్య నేతలతో ఈ రోజు టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు చంద్రబాబు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన, ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనపై నేతలకు దిశా నిర్దేశం చేశారు.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు..
అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.. గత ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన సుగవాసి బాలసుబ్రమణ్యం.. ఇప్పుడు, టీడీపీకి గుడ్‌బై చెప్పారు.. తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పంపారు సుగవాసి బాలసుబ్రమణ్యం..
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వాన్ని నిలదీస్తూ దీనిపై సోషల్ మీడియాలో వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. రాజకీయ కక్షలతో చంద్రబాబు, ఆయన పార్టీనాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయింది.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో ఎంతమంది పాస్? ఎందరు ఫెయిల్? ఏడాది పాలనలో ఎవరెవరి తీరు ఎలా ఉంది? మేటర్ తేల్చడానికి పార్టీ అధిష్టానం ఏం చేస్తోంది? ఆల్రెడీ ఎవరేంటో తేల్చే పని మొదలైందా? రిపోర్ట్‌ని బట్టి ఈసారి యాక్షన్ మామూలుగా ఉండదా? ఎమ్మెల్యేల ప్రోగ్సెస్ కార్డ్‌పై టీడీపీ వర్గాలు ఏమంటున్నాయి? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైంది. గతంలో కనీవినీ ఎరుగని మెజార్టీతో మూడు పార్టీలు కలిసి అధికారం చేపట్టాయి. ఆ బలం ఇచ్చిన కిక్కుతోనే……