గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం అని, ఏడాది కూటమి ప్రభుత్వం పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా అన్నారు. చంద్రబాబు నాయుడు అంటే మోసానికి, ద్రోహానికి, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అప్పు తప్ప.. పాలన, అభివృద్ధి లేదని మండిపడ్డారు. ప్రజలకు అండగా ఉండేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని అంజద్ బాషా పేర్కొన్నారు. కడపలో ‘జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకాన్ని పీఏసీ సభ్యుడు అంజద్ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
Also Read: ATM Thief: ఏటీఎం సెంటర్ల వద్ద మాటేస్తాడు.. కార్డులను మార్చి డబ్బు కొట్టేస్తాడు!
‘గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. ఏడాది కూటమి ప్రభుత్వం పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. చంద్రబాబు అంటే మోసానికి, ద్రోహానికి, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్. ఏడాది పాలనలో అప్పు తప్ప.. పాలన, అభివృద్ధి లేదు. తల్లికి వందనం పథకంలో భారీగా కోతలు విధించారు. ఫించన్ పథకంలో, తల్లికి వందనం పథకంలో లక్షలాది మంది లబ్ధిదారులను మోసం చేశారు. ఏడాది కూటమి పాలన పూర్తిగా విఫలం. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను విస్మరించారు. మహిళలు, రైతులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు మోసం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలు తప్పకుండా టీడీపీ నాయకుల చొక్కా పట్టుకునే పరిస్థితి ఉంటుంది. ప్రజలకు అండగా ఉండేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది’ అని అంజద్ బాషా తెలిపారు.