నేడు సీఎం నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి.. 10.40కి విశాఖ చేరుకుంటారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బీచ్ రోడ్డులోని కాళీమాత గుడి వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి పార్కు హోటల్ వరకూ అంతర్జాతీయ యోగా వేడుకలకు సంబంధించి ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను సీఎం పరిశీలిస్తారు. అనంతరం 11.45 గంటలకు బయలుదేరి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుని యోగా దినోత్సవ ఏర్పాట్లను…
Minister Narayana: అమరావతి రాజధాని నిర్మాణం ఆగదని పురపాలక శాఖ మంత్రి నారాయణ తేల్చి చెప్పారు. రాజధాని నిర్మాణాన్ని జగన్ ఆపాలని ప్రయత్నిస్తున్నాడు.. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్నా పథకాలను కొనసాగిస్తున్నాం. ఎన్డీయే ప్రభుత్వ పని తీరును ప్రజలే మెచ్చుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు.
Nara Lokesh: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. వైసీపీ ఆరోపణలు నిరూపించాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. వైసీపీకి 24 గంటల డెడ్ లైన్ పెట్టారు.
Taneti Vanitha: రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అనే ఆలోచన తప్ప మహిళలకు భద్రత కల్పించాలనే ఆలోచన లేదు ఈ కూటమి ప్రభుత్వానికి అని వైసీపీ మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆరోపించారు.
YS Jagan: సీఎం చంద్రబాబుపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతున్నారు అని పేర్కొన్నారు. వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి నేను ప్రకాశం జిల్లాలోని పొదిలికి వెళ్తే.. ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? అని ప్రశ్నించారు.
పార్టీ ఓడిన తర్వాత నేతల పరిస్థితి ఎలా ఉంటుంది.. ఒకరంతా మౌనంగా వుంటారు.. మరికొందరు తిరగబడతారు.. కానీ, పేర్ని నాని.. ఆయన వేరు. పదవి పోయినా.. పరవశం పోకుండా.. ప్రత్యర్థులను ఢీకొట్టడానికి సిద్ధమవుతున్నారు.
సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం ఇవ్వనుంది ప్రభుత్వం.. రేపే తల్లికి వందనం నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.. సీఎం చంద్రబాబు.. తల్లికి వందనంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు రేపు వారి ఖాతాల్లో జమ చేయనుంది…
High Tension In Podili: ప్రకాశం జిల్లాలోని పొదిలి పర్యటనలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుగు మహిళల నిరసన సెగ తగిలింది. జగన్ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు, నల్ల బ్యాడ్జీలతో టీడీపీ కార్యకర్తలు నిరసన చేశారు.
Nara Lokesh: ప్రకాశం జిల్లా పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, పోలీసులపై వైసీపీ సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.