US-UK: ఇరాన్‌పై దాడికి ప్రణాళిక.. బ్రిటన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు.. కారణమిదే!
- ఇరాన్‌పై దాడికి అమెరికా ప్రణాళిక
- యూకేపైకి మళ్లిన ట్రంప్ ఆగ్రహం
- బ్రిటన్‌పై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘‘సుబ్బి పెళ్లి.. వెంకి చావు’’కు వచ్చినట్లుంది మిత్రదేశాల వ్యవహారం. ఇరాన్‌పై దాడికి అగ్ర రాజ్యం కసరత్తు చేస్తుండగా మిత్రదేశాలైన అమెరికా-బ్రిటన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. అసలేం ఏం జరిగింది? మధ్యప్రాచ్యం తగాదా ఇప్పుడు బ్రిటన్ వైపు ఎందుకు మళ్లింది. అయితే ఈ వార్త చదవాల్సిందే.
ఇరాన్-అమెరికా మధ్య గత కొద్దిరోజులుగా ఉద్రిక్తతలు జరుగుతున్నాయి. అమెరికాతో అణు ఒప్పందం చేసుకునేందుకు ఇరాన్ నిరాకరించింది. దీంతో ఇరాన్‌పై దాడులు చేసేందుకు అగ్ర రాజ్యం కసరత్తు ప్రారంభించింది. ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన యుద్ధ నౌకలను అరేబియా సముద్రానికి తరలించింది. ఏ క్షణంలోనైనా దాడులు చేయొచ్చని అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది.
Also Read
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
- US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
ఇంతలోనే ఈ వ్యవహారంలో మిత్ర దేశాలైన బ్రిటన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తలెత్తేలా చేసింది. ఇరాన్‌పై దాడి చేసే క్రమంలో గ్లౌసెస్టర్‌షైర్ సమీపంలో బ్రిటన్‌కు చెందిన రాయల్ ఎయిర్‌ఫోర్స్ బేస్, హిందూ మహాసముద్రంలో ఉన్న డియెగో గార్సియాను ఉపయోగించుకునేందుకు అమెరికా ప్రత్యేక అనుమతి కోరింది. అందుకు యూకేలోని కీర్ స్టార్మర్ ప్రభుత్వం నిరాకరించింది. అటువంటి దాడిలో పాల్గొని అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించబోమని తేల్చి చెప్పింది. అయితే ఈ సైనిక స్థావరాలు ప్రస్తుతం బ్రిటన్-యూఎస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. అయితే ఇరాన్‌పై దాడి చేసే క్రమంలో ఒకవేళ ఉమ్మడి ఎయిర్‌బేస్ అవసరం వస్తుందేమోనన్న ముందస్తు ఆలోచనతో బ్రిటన్ పర్మిషన్ కోరింది. కానీ అందుకు కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఏ మాత్రం అంగీకరించలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని పేర్కొంది. అటువంటి దాడుల్లో పాల్గొనబోమని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారమే మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తేలా చేసింది.
బ్రిటన్‌పై ట్రంప్ ఆగ్రహం
బ్రిటన్ వైఖరిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. కీర్ స్టార్మర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది తప్పుదారి పట్టించే నిర్ణయంగా పేర్కొన్నారు. బ్రిటన్ వైఖరి కారణంగా ఇప్పుడు చాగోస్ దీవుల భవిష్యత్‌పై కూడా తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. మిత్ర దేశాల మధ్య తీవ్ర వార్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
చాగోస్ దీవుల సంగతేంటి?
బ్రిటన్-అమెరికా మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఇప్పుడు చాగోస్ దీవులపై నీలినీడలు కమ్ముకునేటట్టు కనిపిస్తోంది. డియెగో గార్సియాలో యూఎస్-యూకేకు ఉమ్మడి సైనిక స్థావరం ఉంది. ఇది హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక కీలకమైన వ్యూహాత్మక స్థావరం. ఇక్కడే చాగోస్ దీవులు ఉన్నాయి. ఇది రెండు దేశాలకు సంబంధించిన వ్యవహారం. అయితే ఈ చాగోస్ దీవులను మారిషస్‌కు అప్పగించి.. డియెగో గార్సియాను 99 సంవత్సరాల పాటు 35 బిలియన్లకు లీజుకు ఇవ్వాలని యూకే యోచిస్తోంది. అయితే ఈ దీవులపై బ్రిటన్-అమెరికా మధ్య దీర్ఘకాల భాగస్వామ్యం ఉంది. మధ్యప్రాచ్యం, ఇండో-పసిఫిక్‌లో సైనిక కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు రెండు దేశాలకు సంబంధాలు ఉన్నాయి. కానీ ఏకపక్షంగా ఆ దీవులను మారిషిస్‌కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రణాళిక రచిస్తోంది. ఈ నేపథ్యంలో మారిషస్‌తో బ్రిటన్ ఒప్పందం చేసుకోవడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది చాలా పెద్ద తప్పుగా అభివర్ణించారు. తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే.. ఇరాన్‌తో కంటే బ్రిటన్‌తోనే ఉద్రిక్తతలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: US-Iran: ఇరాన్ అష్టదిగ్బంధం.. భారీ దాడులకు అమెరికా ప్లాన్.. ఇజ్రాయెల్ అలర్ట్
తాజావార్తలు
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
ట్రెండింగ్
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!