రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 20 జిల్లాల్లో వ్యతిరేకత ఉందని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ అన్నారు. మూడు అడుగుల గొయ్యి తీస్తే నీరు ఉంటుందని, అలాంటిది 50 అంతస్తుల సచివాలయం కడతా అంటున్నారు? అని విమర్శించారు. జీరో కరప్షన్ అంటున్నారు కానీ.. ప్రతి ఎమ్మార్వో, పోలీస్ స్టేషన్లో డబ్బులు తీసుకుంటున్నారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం కుప్పంలో అత్యాచారాలు, దాడులు, పేదరికం తొలించలేని చంద్రబాబు నాయుడు.. రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేస్తారా? అని ప్రశ్నించారు. ఏపీ ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉందని చింతా మోహన్ పేర్కొన్నారు.
‘ఏపీలో గిరిజనులపై అత్యాచారాలు, దాడులు ఎక్కువవుతున్నాయి. గిరిజనులు, దళితులపై దాడులను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. చంద్రబాబు నాయుడు మాటల మనిషి. సొంత నియోజకవర్గం కుప్పంలో అత్యాచారాలు, దాడులు, పేదరికం తొలించలేని చంద్రబాబు.. రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేస్తారా?. వైఎస్ జగన్‌కి భయపడి చంద్రబాబును గెలిపించారు. వికసిత ఆంధ్రను చంద్రబాబు చేయలేడు. చంద్రబాబే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అరకులో మహిళల ముందే గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు. కుప్పంలో నిరుపేద ఓబీసీ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి బాలేదు’ అని చింతా మోహన్ అన్నారు.
Also Read: Jakkampudi Raja: ఎన్ని కుయుక్తులు పన్నినా.. జన ప్రవాహాన్ని అడ్డుకోలేరు!
‘ఏపీ ప్రజలు అప్పుల్లో ఉన్నారు. 10 రూ.వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నారు. ఏపీ ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉంది. అమరావతి దేవతల రాజధాని అనేది తప్పు. చంద్రబాబు నాయుడుకు బంధుప్రీతి ఎక్కువ. అమరావతిపై 20 జిల్లాల్లో వ్యతిరేకత ఉంది. మూడు అడుగుల గొయ్యి తీస్తే నీరు కనిపిస్తుంది, అలాంటిది 50 అంతస్తుల సచివాలయం కడతా అంటున్నారు. కుప్పంలో కూటికి గతిలేక ప్రజలున్నారు. జీరో కరప్షన్ అంటున్నారు కానీ.. ప్రతి ఎమ్మార్వో, పోలీస్ స్టేషన్లో డబ్బులు తీసుకుంటున్నారు’ అని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ మండిపడ్డారు.