IND Playing 11 vs SA: దక్షిణాఫ్రికాతో సూపర్-8 మ్యాచ్.. టీమిండియాలో ఊహించని మార్పు?
- సూపర్-8కు చేరుకున్న టీమిండియా
- దక్షిణాఫ్రికాతో సూపర్-8 మ్యాచ్
- టీమిండియాలో ఊహించని మార్పు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India playing XI vs South Africa: టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. లీగ్ దశలో నాలుగు విజయాలు సాధించిన టీమిండియా సూపర్-8కు చేరుకుంది. సూపర్-8లో ఆదివారం (ఫిబ్రవరి) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ కీలక పోరుకు ముందు టీమిండియా కాంబినేషన్‌లో భారీ మార్పు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి జట్లు భారత జట్టులోని లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్లను ఆఫ్ స్పిన్నర్లతో టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో కొత్త వ్యూహాలపై టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ రైన్ టెన్ డస్కటే వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
తాజాగా రైన్ టెన్ డస్కటే మాట్లాడుతూ… ‘భారత జట్టులో బెంచ్‌లో ఉన్న ఆటగాళ్లలో మంచి ఎంపికలు ఉన్నాయి. ముఖ్యంగా సంజు శాంసన్ వంటి అనుభవజ్ఞుడైన బ్యాటర్ ఉన్నాడు. నంబర్-3 స్థానంలో ఆడిన అనుభవం సంజుకు ఉంది. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం అతడికి ఉంది. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సంజు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు’ అని చెప్పాడు. సంజు టెక్నిక్, టెంపరమెంట్ మిడిల్ ఓవర్‌లలో కీలక పాత్ర పోషించగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో దక్షిణాఫ్రికా లాంటి కీలక మ్యాచ్ ముందు జట్టులో అతనికి అవకాశం ఇవ్వాలనే చర్చలు జోరందుకున్నాయి.
Also Read
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
- India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
ప్రస్తుత ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉన్న తిలక్ వర్మ స్థానంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే.. తిలక్ స్థానంలో సంజు శాంసన్‌ను తీసుకునే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. సూపర్-8 వంటి కీలక దశలో సరైన కాంబినేషన్ ఎంపిక చాలా ముఖ్యం. కాబట్టి ప్రత్యర్థి బౌలింగ్‌కు తగిన బ్యాటింగ్ లైనప్‌ను ఎంపిక చేయడంలో టీమ్ మేనేజ్‌మెంట్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మ్యాచ్ రోజునే అసలు ప్లానింగ్ ఏంటో తేలనుంది. సంజు గత ఇన్నింగ్స్‌లో 8 బంతుల్లో 22 రన్స్ చేసిన విషయం తెలిసిందే. వరుసగా మూడు సిక్సులు, ఓ ఫోర్ బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు తిలక్ స్ట్రైక్‌రేట్ తక్కువగా ఉండడం టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఆలోచనలో పడేస్తోంది.
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!