Taneti Vanitha: రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అనే ఆలోచన తప్ప మహిళలకు భద్రత కల్పించాలనే ఆలోచన లేదు ఈ కూటమి ప్రభుత్వానికి అని వైసీపీ మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆరోపించారు.
YS Jagan: సీఎం చంద్రబాబుపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతున్నారు అని పేర్కొన్నారు. వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి నేను ప్రకాశం జిల్లాలోని పొదిలికి వెళ్తే.. ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? అని ప్రశ్నించారు.
పార్టీ ఓడిన తర్వాత నేతల పరిస్థితి ఎలా ఉంటుంది.. ఒకరంతా మౌనంగా వుంటారు.. మరికొందరు తిరగబడతారు.. కానీ, పేర్ని నాని.. ఆయన వేరు. పదవి పోయినా.. పరవశం పోకుండా.. ప్రత్యర్థులను ఢీకొట్టడానికి సిద్ధమవుతున్నారు.
సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం ఇవ్వనుంది ప్రభుత్వం.. రేపే తల్లికి వందనం నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.. సీఎం చంద్రబాబు.. తల్లికి వందనంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు రేపు వారి ఖాతాల్లో జమ చేయనుంది…
High Tension In Podili: ప్రకాశం జిల్లాలోని పొదిలి పర్యటనలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుగు మహిళల నిరసన సెగ తగిలింది. జగన్ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు, నల్ల బ్యాడ్జీలతో టీడీపీ కార్యకర్తలు నిరసన చేశారు.
Nara Lokesh: ప్రకాశం జిల్లా పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, పోలీసులపై వైసీపీ సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్థితి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఆరోపించారు. ఈ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. కొండపి, పర్చూరులో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.. రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం.. ఏ రైతు చూసినా తక్కువ ధరలకు తమ పంటలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైఎస్ జగన్ మండిపడ్డారు.
Vangalapudi Anitha: అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్.రాయవరం మండలం గెడ్డపాలెం గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏరువాక కార్యక్రమంలో భాగంగా భూమి పూజ చేసింది. కాడెడ్లతో నాగలి పట్టుకొని మంత్రి అనిత పొలం దున్నింది.
మారాయ్... రూల్స్ మారిపోయాయ్..... ఇకనుంచి ఎవరు పడితే వాళ్ళు వచ్చి సైకిలెక్కి కూర్చుంటే... వాళ్ళ పాపాలను మోస్తూ.... బరువును భరిస్తూ తొక్కడానికి మేం సిద్ధంగా లేమని అంటున్నారట టీడీపీ పెద్దలు. అందుకే పార్టీలో చేరాలనుకునే వాళ్ళకు కొత్త కండిషన్స్ పెడుతున్నట్టు తెలుస్తోంది. అది వైసీపీ నుంచి కావచ్చు. ఇతర ఏ పార్టీ నుంచైనా కావచ్చు... టీడీపీలో చేరాలంటే తప్పనిసరిగా కొన్ని షరతులకు లోబడి ఉండాల్సిందేనని అంటున్నారట.