తీగ లాగితే డొంక కదిలిన చందంగా టీడీపీ నేతల లీలలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఫైబర్ నెట్ కార్పొరేషన్లో గోల్ మాల్ జరిగిందని ఆరోపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక టీడీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను ఒక్కొక్కటిగా బయటికి లాగుతున్నారు. ఇప్పటికే నాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మంత్రులను జైళ్లకు పంపిన సంఘటనలు ఉన్నాయి. ఇక ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడిపై ఫైబర్ నెట్ స్కాం…
నాయకులు ఎవరైనా ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తారు… కానీ చంద్రబాబు, టీడీపీ మద్యపాన ఉద్యమం చేస్తాం అంటున్నారు అని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. చంద్రబాబుకు మద్యపాన నియంత్రణ ఇష్టం లేనట్లు కనిపిస్తోంది. ఎన్టీఆర్ పెట్టిన మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన వ్యక్తి చంద్రబాబు. మేము మద్యం షాపుల సంఖ్యను సగానికి తగ్గించాం. ఈర్ష్య, ద్వేషం, పగ…ఈ మూడు చంద్రబాబు లక్షణాలు. కాబట్టి ప్రజా కోర్టులో చంద్రబాబుకు ఉరిశిక్ష వేశారు అని పేర్కొన్నారు. తాగుబోతులు, మద్య…
మూడేళ్ల క్రితం వరకు ఆ జిల్లాలో టీడీపీ ఓ వెలుగు వెలిగింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ కకావికలం. నాడు కీ రోల్ పోషించిన నాయకులు పత్తా లేకుండా పోయారు. అధినేత ఆదేశాలతో ఫీల్డ్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ నలుగురు పోరాటాలకు సిద్ధమయ్యారని టాక్. ఇంతకీ ఎవరా నాయకులు? స్వయంకృతాపరాధంతో హారతి కర్పూరమైన టీడీపీ ప్రతిష్ట! గుంటూరు జిల్లాను గతంలో తమ అడ్డాగా చెప్పుకొన్న టీడీపీ.. వైసీపీ గాలిలో ఆ అడ్రస్‌ను గల్లంతు చేసుకుంది.…
వినాయక చవితి ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది… సీఎం వైఎస్ జగన్, ఏపీ సర్కార్‌పై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి… ఇక, వ్యవహారంలో సీఎం జగన్‌పై మండిపడ్డారు మాజీ మంత్రి కిడారి.. వినాయక చవితి వేడుకలు రద్దు చేయడం ఏంటి? అని ప్రశ్నించిన ఆయన.. కులాలు, మతాల మధ్య సీఎం జగన్ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.. వినాయక చవితి వేడుకలను ప్రభుత్వం రద్దు చేయడం సిగ్గు చేటు అని వ్యాఖ్యానించిన ఆయన.. తల్లిదండ్రులు వద్దంటున్నా…
ఆంధ్రప్రదేశ్ లో రహదారుల చుట్టూ రాజకీయం ముసురుకుంటోంది. దెబ్బతిన్న రహదారులపై.. విపక్షాలు సమరభేరి మోగిస్తుంటే.. అధికార పక్షం సైతం దీటుగా స్పందిస్తూ.. టగ్ ఆఫ్ వార్ గా ముందుకు వెళ్తోంది. అవసరమైతే అప్పులు సైతం తీసుకునైనా రోడ్లు బాగు చేస్తామని ప్రభుత్వం నుంచి స్పందన వస్తుంటే.. ఇటు టీడీపీ, జనసేన నేతలు ఈ అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లేందుకు యత్నిస్తున్నాయి.ఇప్పటికే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ విషయమై మాట్లాడారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఉధృతంగా ప్రచారంలోకి…
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రోడ్ల దుస్థితికి గత తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని ఆరోపించారు మంత్రి శంకర నారాయణ… సీఎం వైఎస్ జగన్.. రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరైన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని.. వర్షాకాలం పూర్తి అయిన తర్వాత రోడ్ల మరమ్మతులు చేపడతామని ప్రకటించారు.. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ రోడ్లను పూర్తిగా గాలికి వదిలేసిందని ఆరోపించిన శంకర నారాయణ.. అక్టోబర్ తర్వాత రోడ్ల పనులు ప్రారంభిస్తామని…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ, నవ్యాంధ్రలుగా ఏర్పడ్డాక రాజకీయంలో స్పష్టమైన మార్పు వచ్చేసింది. తెలంగాణ మిగులు బడ్జెట్ తో ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించగా.. ఏపీ మాత్రం లోటుబడ్జెట్ రాష్ట్రంగా మిగిలిపోయింది. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం చెప్పినా.. అది నీటిమీద రాతలుగా మిగిలిపోయింది. హైదరాబాద్ ను తానే నిర్మించానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనలో కనీసం ఏపీకి రాజధానిని కూడా నిర్మించకపోవడం శోచనీయంగా మారింది. తన పాలనలో సంక్షేమాన్ని పెద్దగా…
సామాజిక న్యాయానికి ప్రతిరూపం సీఎం వైఎస్ జగన్ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేవారు జూపూడి ప్రభాకర్… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళకు నామినేటెడ్ పదవుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నారన్న ఆయన.. తన కేబిన్‌లో కూడా బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత కల్పించారని ప్రశంసించారు.. చంద్రబాబు హయాంలో ఎందుకు సామాజిక న్యాయం పాటించలేక పోయారు? అని ప్రశ్నించిన జూపూడి.. ఒక ఎస్టీని డీజీపీగా సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించారని.. ఎస్టీ అధికారి…
టీడీపీలో భావి సీఎంగా ప్రచారం అవుతున్న లోకేష్ బాబును వచ్చే ఎన్నికలకు పక్కన పెడుతున్నారా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 2024 ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా నారా లోకేష్ ను ప్రకటించాలని చంద్రబాబు భావించారు. ఈక్రమంలోనే కొద్దిరోజలుగా టీడీపీలో లోకేష్ నాయకత్వాన్ని ప్రొజెక్టు చేసేలా కార్యక్రమాలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే టీడీపీ సీనియర్లు మాత్రం లోకేష్ నాయకత్వంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీలో…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం అటూ రాజకీయాల్లో.. ఇటూ సినిమాల పరంగానూ బీజీగా మారిపోయారు. ఒకేసారి రెండు పడవలను నడుపుతున్న ‘పవర్ స్టార్’ తొలి నుంచి తనది పాతికేళ్ల రాజకీయమని చెప్పుకొస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రాజకీయ అనుభవాన్ని సంపాదిస్తూ ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రాజకీయపరంగా చాలా గుణపాఠాలను నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. అయితే పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీని లైమ్…