అవకాశం దొరికినప్పుడల్లా తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, ఇతర నేతలపై ఒంటికాలితో లేచే మంత్రి కొడాలి నాని.. మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు, లోకేష్‌ను ఉద్దేశిస్తూ.. తుప్పు, పప్పు అంటూ ఫైర్ అయ్యారు.. పరిషత్ ఎన్నికలను బహిష్కరించామని చంద్రబాబు అంటున్నారు.. మరి.. టీడీపీ నుంచి గెలిచినవాళ్లంతా.. పార్టీ ఆదేశాలను ధిక్కరించినవాళ్లా? అని ప్రశ్నించారు.. సీఎం జగన్‌ను ప్రజలు దీవిస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్న కొడాలి నాని.. పరిషత్ ఎన్నికల్లో 99 శాతం జడ్పీటీసీలు, 85 శాతం ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుని వైసీపీ ప్రభంజనం సృష్టించిందన్నారు.. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో కూడా వైసీపీకి ఎదురేలేదన్న ఆయన.. కుప్పం, నారావారిపల్లె, నిమ్మకూరులోనూ తమ పార్టీ అభ్యర్థులు గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి ఉండదన్నారు.. ఇక, సీఎం జగన్ ఇంటి నుంచి బయటకు రాకుండానే ఎన్నికల్లో పాల్గొన్నారని తెలిపారు. ఇంతకాలం నిమ్మగడ్డను అడ్డం పెట్టుకొని చంద్రబాబు పారిపోయాడని సెటైర్లు వేశారు.. ఇక, పరిషత్ ఎన్నికల్లో గెలిచినవారిలోంచే ఒకరిని టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని సలహా ఇచ్చారు కొడాలి నాని.. ఇక, ఈ సందర్భంగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..